మెగాస్టార్ చిరంజీవి సంక్రాంతి సందర్భంగా వాల్తేరు వీరయ్య సినిమాతో ప్రేక్షకుల ముందుకు రానున్నాడు. రెండు రోజుల క్రితమే ప్రీరిలీజ్ ఈవెంట్ ఘనంగా నిర్వహించారు. ఇక జనవరి 13న సంక్రాంతి సందర్భంగా సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది. ప్రస్తుతం సినిమా టీమ్ అంతా.. ప్రమోషన్ కార్యక్రమాలతో బిజీగా ఉంది. ఈ క్రమంలో మెగాస్టార్ చిరంజీవి.. డిజిటల్ మీడియాలో నంబర్ వన్‌గా రాణిస్తున్న సుమన్ టీవీకి ప్రత్యేక ఇంటర్వ్యూ ఇచ్చారు. సీనియర్ జర్నలిస్ట్ ప్రభు.. చిరంజీవిని ఇంటర్వ్యూ చేశారు. వాల్తేరు వీరయ్య సినిమాకు సంబంధించిన విశేషాలతో పాటు.. గతంలో చిరంజీవి జీవితంలో చోటు చేసుకున్న పలు ఆసక్తికర సంఘటనల గురించి ప్రశ్నించారు. ఈ క్రమంలో చిరంజీవిపై విష ప్రయోగం జరిగిన విషయాన్ని ప్రస్తావించి.. బర్త్‌డే కేక్‌లో విషం కలిపి.. మీచేత తినిపించాలని చూశారంట.. ఎవరు చేశారు.. ఎందుకు అని ప్రశ్నించారు ప్రభు.
ఈ ప్రశ్నకు చిరంజీవి బదులిస్తూ.. ‘‘ఓ అభిమాని చేసిన పిచ్చి పని ఇది. మరణమృదంగం షూటింగ్ సందర్భంగా ఈ సంఘటన చోటు చేసుకుంది. అప్పట్లో అభిమానులు వచ్చి డైరెక్ట్‌గా కలిసేవారు. ఆ రోజు ఫైట్ షూట్ జరుగుతుంది. కొంతమంది అభిమానులు వచ్చారు. కేక్ కట్ చేయించారు. నేను ఎప్పుడైనా సరే.. స్పూన్‌తోనే తింటాను. చేతితో పెడితే తినను. కానీ ఆ రోజు ఓ అభిమాని.. బలవంతంగా కేక్ నా నోట్లో పెట్టే ప్రయత్నం చేశాడు. నోట్లే పెట్టినప్పుడు చేదుగా అనిపించింది. వెంటనే ఉమ్మేశాను. తర్వతా టెస్ట్ చేస్తే.. కేక్‌లో ఏదో పౌడర్ కనిపించింది’’ అని గుర్తు చేసుకున్నారు.
‘‘వెంటనే అక్కడున్న వారు.. అతడిని పట్టుకుని నాలుగు పీకి.. ఏం కలిపావ్ అని అడగడంతో.. అప్పుడు నిజం చెప్పాడు. తను నా అభిమాన సంఘానికి అధ్యక్షుడంట. అయితే కొన్ని రోజులుగా నేను తనను పట్టించుకోవడం లేదనే కోపంతో.. కేరళ నుంచి ఏదో వశీకరణ పూజ చేసి ఏదో పొడి తెచ్చి కేక్‌లో కలిపాడు. అది తింటే.. నేను గతంలో మాదిరే.. తనతో మాట్లాడతాను అనుకున్నాడు. ఏదో మూర్ఖత్వం కొద్ది చేశాడు అని వదిలేశాను. అంతే తప్ప విష ప్రయోగం కాదు’’ అని క్లారిటీ ఇచ్చారు చిరంజీవి. ప్రసుత్తం ఇందుకు సంబంధించిన వీడియో వైరలవుతోంది. దీనిపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.