చిత్రపరిశ్రమలో ఒకే ఏజ్ గ్రూప్ కి చెందిన హీరోలైనా.. ఒకే దశలో స్టార్డమ్ ని, పోటీని చూసిన హీరోలను కంపేర్ చేసి చూస్తుంటారు ఫ్యాన్స్. దశాబ్దాల కెరీర్ లో వారు సాధించిన విజయాలు, రికార్డులు.. ఇలా ఎన్నో విషయాలపై చర్చలు జరుపుతుంటారు. తెలుగులో దశాబ్దాలుగా ఇండస్ట్రీని ఏలుతున్న బిగ్ స్టార్స్ ఎవరైనా ఉన్నారంటే.. వారిలో ఖచ్చితంగా మెగాస్టార్ చిరంజీవి, నటసింహం నందమూరి బాలకృష్ణ పేర్లు ముందు వరుసలో ఉంటాయి. వీరిద్దరూ ఒకరినొకరు పోటీగా భావించకపోయినా.. ఎవరికి వారే పోటీగా దూసుకుపోతున్నారు. మధ్యమధ్యలో హిట్స్ పరంగా ఒకరిపై ఒకరు పైచేయి సాధించి ఉండవచ్చు. కానీ.. ఆఖరికి ఇద్దరూ టాలీవుడ్ కి రెండు కళ్ళలాంటి ప్రస్థానాన్ని కలిగి ఉన్నారు.
కెరీర్ లో 150కి పైగా సినిమాలతో మెగాస్టార్.. 100కి పైగా సినిమాలతో బాలకృష్ణ.. ఎవరి స్టార్డమ్ వారిదే. ఇన్నేళ్ళుగా ఏ ఒక్కరి స్టార్డమ్ లో, క్రేజ్ లో మార్పులు రాలేదు. కానీ.. ఇండస్ట్రీలో వచ్చిన మార్పుల వలన ఇద్దరి హీరోల మార్కెట్ లను కంపేర్ చేస్తున్నారు. పాన్ ఇండియా అనే కల్చర్ వచ్చాక.. హీరోల మార్కెట్స్ పూర్తిగా మారిపోయాయి. ప్రేక్షకులు ఒకప్పుడు సినిమాలను ఆదరించిన తీరు వేరు.. ఇప్పుడు నడుస్తున్న ట్రెండ్ వేరు. చిరు – బాలయ్య సినిమాలు ఎప్పుడు పోటీగా విడుదలైనా.. ఎవరి మార్కెట్ వారిదే. రెండు సినిమాలు పెద్ద హిట్ కావాలని కోరుకునే వారెందరో. కానీ.. కాలానుగుణంగా వచ్చిన మార్పులతో ప్రీ రిలీజ్ బిజినెస్ లో, కలెక్షన్స్ లో కూడా వ్యత్యాసం చూస్తున్నారు.
ఎప్పుడైనా సరే కంటిన్యూస్ గా ఒక్కరే స్టార్డమ్ కొనసాగించలేరు. హిట్స్, ప్లాప్స్ అనేవి సహజం. అలాగని అప్పుడు ఆయన తోపు, ఇప్పుడు ఈయన తోపు అని కూడా కొలతలు వేయలేము. ఘరానా మొగుడు, గ్యాంగ్ లీడర్, మెకానిక్ అల్లుడు, స్నేహం కోసం, ముగ్గురు మొనగాళ్లు, చూడాలని ఉంది, అన్నయ్య సినిమాలతో చిరు ఫుల్ స్వింగ్ లో ఉన్నప్పుడు.. బాలయ్య కొన్ని ప్లాప్ లను చూశాడు. కానీ.. కొన్నాళ్ళకి సమరసింహారెడ్డి, నరసింహ నాయుడు, చెన్నకేశవరెడ్డి లాంటి సినిమాలతో మాస్ హీరోగా బాలయ్య ఫామ్ లోకి వచ్చినప్పుడు.. చిరు కూడా కొన్ని ప్లాప్స్ చూశాడు. కొన్ని సందర్భాలలో ఇద్దరూ మాస్ హీరోలుగా బిగ్గెస్ట్ హిట్స్ చూశారు.
ఈ క్రమంలో క్రేజ్ పరంగా బాలయ్యది పైచేయి అయినా.. మార్కెట్ పరంగా చిరునే టాప్ లో ఉండటం విశేషం. వీరిద్దరిని కంపేర్ చేయడానికి లేదు. ఇప్పటికీ చూసుకున్నా.. తొమ్మిదేళ్ల గ్యాప్ తర్వాత రీఎంట్రీ ఇచ్చినా.. బిజినెస్ పరంగా చిరు సినిమాలే ఎక్కువ నెంబర్స్ సాధిస్తున్నాయి. చిరు బ్రేక్ లో ఉన్నప్పుడు నాన్ స్టాప్ సినిమాలు చేసినా బాలయ్య మార్కెట్ పెరగలేదు. అంటే.. బాలయ్య ఆల్రెడీ చెన్నకేశవరెడ్డి సినిమా తర్వాత కమర్షియల్ గా చాలా ఫెయిల్యూర్స్ చూశాడు. అందుకే తన సినిమాలకు రిస్క్ లేకుండా బడ్జెట్ ని సెట్ చేసుకొని సినిమాలు చేస్తున్నాడు. అందుకే బిజినెస్ తక్కువైనా త్వరగా బ్రేక్ ఈవెన్ పూర్తి చేయగలుగుతున్నాడు.
మరోవైపు చిరు తొమ్మిదేళ్ల గ్యాప్ తో వచ్చినా.. ఆయన మాస్ హీరోగా ఆయన మార్కెట్ ఇంకా పెరుగుతూ ఉందిగాని ఎక్కడా తగ్గలేదు. అందుకు నిదర్శనంగా వాల్తేరు వీరయ్య, వీరసింహారెడ్డి ప్రీ రిలీజ్ బిజినెస్ లెక్కలే ఉన్నాయని ట్రేడ్ వర్గాలు చెబుతున్నాయి. అఖండ లాంటి హిట్ తర్వాత బాలయ్య చేసిన వీరసింహారెడ్డి సినిమా బిజినెస్ రూ. 74 కోట్లు చేయగా.. వాల్తేరు వీరయ్య రూ. 89 కోట్ల బిజినెస్ చేసినట్లు సమాచారం. ఈ లెక్కన బాలయ్య ఫామ్ లో ఉన్నా.. చిరు సినిమాలు నార్మల్ గా ఆడినా హైయెస్ట్ బిజినెస్ నమోదు చేస్తుండటం చర్చనీయాంశంగా మారింది. ఇప్పటికీ ఎవరి మార్కెట్ వారిదే. మరి చిరు – బాలయ్యల బిజినెస్ లపై మీ అభిప్రాయాలను కామెంట్స్ లో తెలపండి.
Who has Mass Fan Following in Telugu States??
Let’s settle it 💥💥💥https://t.co/l4P00nPwdx#WaltairVeerayya #VeeraSimhaReddy🔄 #Balakrishna ♥️ #Chiranjeevi pic.twitter.com/cei7ZlANnP
— Indian Box Officeᵀᴹ (@Indian_BoxOffic) January 8, 2023