దేశవ్యాప్తంగా 75వ స్వాతంత్య్ర దినోత్సవ వేడుకలు అంగరంగ వైభవంగా జరుగుతున్నాయి. ప్రధాని నరేంద్ర మోదీ ఎర్రకోట మీద జెండా ఎగురవేసి జాతినుద్దేశించి ప్రసంగించారు. ఇక రెండు తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులు కూడా జెండా ఎగురవేసి.. ప్రజలకు శుభాకాంక్షలు తెలిపారు. ఇక స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా సినీ, రాజకీయ ప్రముఖులు శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా చిరంజీవి బ్లడ్ బ్యాంక్‌లో స్వాతంత్య్ర దినోత్సవ వేడుకలు జరిగాయి. చిరంజీవి ముఖ్యఅతిథిగా హాజరయ్యి జెండా ఎగురవేశారు. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన వీడియో నెట్టింట వైరల్‌గా మారింది.