తెలుగు ఇండస్ట్రీలో మెగాస్టార్ చిరంజీవి మంచి ఫామ్ లో ఉండగా సొంత పార్టీ పెట్టి రాజకీయాల్లోకి వెళ్లారు. దాదాపు పదేళ్ల తర్వాత ఖైదీ నెం.150 తో సినిమాల్లోకి రీఎంట్రీ ఇచ్చారు మెగాస్టార్ చిరంజీవి. ఆ తరువాత తన స్పీడ్‌ని పెంచారు. ప్రస్తుతం జోరుమీదున్న చిరంజీవి గాడ్ ఫాదర్, భోళా శంకర్, వాల్తేరు వీరయ్య సినిమాలు షూటింగ్ లతో బిజీగా ఉన్నారు. ఆయన నటించిన ‘ఆచార్య’ విడుదలకు సిద్ధంగా ఉంది. ఆ తర్వాత చిరు లైనప్ చూస్తే ప్రస్తుతం టాప్ ప్లేస్ లో ఉన్న యువహీరోలకు దీటుగా సాగుతున్నట్లు అర్థం అవుతుంది. తాజాగా ఓ రియల్ ఎస్టేట్ కంపెనీకి చిరంజీవి బ్రాండ్ అంబాసిడర్ గా సైన్ చేసినట్లు తెలుస్తోంది.
ఇది కూడా చదవండి: ఆటో డ్రైవర్ నిజాయితీ.. లక్షల విలువగల నగల్ని..
చిరు సైన్ చేసిన బ్రాండ్ అధికారిక ప్రకటన త్వరలో రానుంది. ఈ మద్య చాలా మంది యంగ్ హీరోలు వివిధ కంపెనీలకు బ్రాండ్ అంబాసిడర్స్ గా ఉంటున్న విషయం తెలిసిందే. ఇక మహేశ్ బాబు వంటి హీరోలు రియల్ ఎస్టేట్ కంపెనీలకు బ్రాండ్ అంబాసిడర్స్ గా వ్యవహరిస్తున్నారు. అంతే కాదు చిరంజీవి తనయుడు రామ్ చరణ్ కూడా రియల్ ఎస్టేట్ కంపెనీకి బ్రాండ్ అంబాసిడర్‌గా సైన్ చేయటం విశేషం. లేటెస్ట్‌గా చిరు ఓ ప్రముఖ రియల్ ఎస్టేట్ కంపెనీతో బ్రాండ్ అంబాసిడర్ గా డీల్ చేసుకున్నాడట.
కాకపోతే ఆ బ్రాండింగ్ వివరాలకు సంబంధించి అధికారిక ప్రకటన త్వరలో విడుదల కానుందట. మరి మెగాస్టార్ లాంటి అగ్ర హీరో ఓ రియల్ ఎస్టేట్ కు బ్రాండ్ అంబాసిడర్ గా ఉండటం అనేది అందరికీ ఆసక్తి కలిగించే విధంగా ఉంది.