సినిమా అనేది ఓ రంగుల ప్రపంచం. ఇందులో ఎన్నో పాత్రలు ఉంటాయి. అయితే ఇక్కడ హీరో, హీరోయిన్ లే ప్రధానం. అయితే ఈ హీరో, హీరోయిన్ల విషయంలో చాలా వ్యత్యాసలు ఉన్నాయి. ఇండస్ట్రీలో హీరోయిన్ల కాలపరిమితి చాలా తక్కువ. అదే సమయంలో హీరోలకు లాంగ్ టైమ్ ఉంటుంది. అలా ఒక సినిమాలో హీరోతో పనిచేసిన నటి కొంతకాలానికి గా అదే హీరో సినిమాల్లో చెల్లిగా, వదిన, అమ్మగా పాత్రలు చేస్తుంది. అలా ఎందరో అనేక సినిమాలో నటించారు. సినిమా ఇండస్ట్రీలో అలాంటి విచిత్రమైన కలయిక మెగస్టార్ చిరంజీవి, అలనాటి నటి సుజాతది. వీరిద్దరి సినీ కెరీర్ మొదలైనప్పుటి నుంచి ఒక్కొ సందర్భంలో ఒక్కో కలయికతో కనపించారు. మరి.. వారిద్దరి సినిమా గురించి ఇప్పుడు ఓ సారి చూద్దాం..
సినిమా పరిశ్రమలో అనేక మంది నటీమణులు అనేక పాత్రలో నటిస్తుంటారు. నాటి తరం హీరోయిన్ల నుంచి నేటి తరం వారికి వరకు అందరు అలానే నటించిన వారే. నటీమణులకు ఇండస్ట్రీలో హీరోయిన్ గా కాలపరిమితి తక్కువగా ఉంటుందన్న సంగతి తెలిసిందే. హీరోయిన్ గా ఆఫర్లు తగ్గిన తరువాత చెల్లిగా, అక్కగా, చివరకు అమ్మ పాత్రలకు చేస్తూ అందరిని మెప్పిస్తుంటారు. ఆలాంటి వారిలో సుజాత ఒకరు. చిరంజీవి, సుజాతలు అనేక సినిమాలో విభిన్నమైన పాత్రలో నటించారు. ‘ప్రేమ తరంగాలు’ అనే సినిమాతో చిరంజీవి, సుజాతలు హీరో, హీరోయిన్లుగా నటించారు. ఈ సినిమా హిందీలో విడుదలైన ‘ముకందర్ సికందర్’ అనే సినిమాకు రీమేక్. అయితే చిత్రంలో సంపన్నుడి వద్ద హీరో పనిచేస్తుంటాడు.
ఆ ధనవంతుడి కూతురు(సుజాత)తో హీరో స్నేహం చేస్తాడు. ఇందులో చిరు, సుజాతలు నటించారు. అయితే ఆ తర్వాత 1982లో రిలీజ్ అయినా ‘సీతాదేవి’ అనే మూవీలో వీరిద్దరు అన్న చెల్లెలి పాత్రల్లో నటించారు. ఈ సినిమాలో కథ మొత్తం అన్నా చెల్లిలి చుట్టూనే తిరుగుతుంది. ఆ తర్వత కాలంలో విజయ బాపినీడు దర్శకత్వం వహించిన బిగ్ బాస్ చిత్రంలో చిరంజీవి, సుజాతలు నటించారు. 1995 విడుదలైన బిగ్ బాస్ చిత్రంలో చిరు తల్లి పాత్రలో సుజాత నటించింది.
అలా వీరిద్దరు తమ కెరీర్ మొదలైనప్పటి నుంచి చిరంజీవి హీరోగా నటిస్తూంటే ..సుజాత ప్రియురాలి, చెల్లిగా, అమ్మగా నటించింది. ఇలా కేవలం సుజాత నే కాకుండే ఎంతో మంది హీరోయిన్లు అలా అనేక పాత్రలో నటించారు. అన్ని ఇండస్ట్రీలో ఇలా ఉంటుంది. మరి.. చిరు, సుజాతలకు సంబంధించిన ఈ సినిమా విశేషాలపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.