తెలుగు ఇండస్ట్రీలో మెగా హీరోలకు ఎంత ఫాలోయింగ్ ఉంటుందో ప్రత్యేకంగా చెప్పనక్కరలేదు. మెగా ఫ్యామిలీకి సంబంధించిన ఏ చిన్న అప్ డేట్ ఉన్నా సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా మారుతుంది. ఇక మెగాస్టార్ చిరంజీవి, పవన్ కళ్యాన్ ఇద్దరూ ఒకే ఫ్రేమ్ లో కనిపిస్తే ఫ్యాన్స్ ఆనందానికి అవధులు ఉండవు. తాజాగా మాజీ మంత్రి మండలి బుద్ధ ప్రసాద్ కుమారుడు వెంకట్రామ్ వివాహ రిసెప్షన్ వేడుక హైదరాబాదులో జరిగింది. ఈ వేడుకకు మెగాస్టార్ చిరంజీవి, జనసేనాని పవన్ కల్యాణ్ కూడా హాజరయ్యారు.
ఇక మెగా బ్రదర్స్ రాకతో అక్కడ సందడి వాతావరణం నెలకొంది. చిరంజీవి, పవన్ కల్యాణ్ వధూవరులకు ఆశీర్వాదాలు అందజేశారు. అనంతరం మండలి బుద్ధ ప్రసాద్ కుటుంబసభ్యులతో కలిసి ఫొటోలకు పోజులిచ్చారు. అయితే వేడుకలో పవన్ కళ్యాణ్ అన్నయ్య చేతిలో చేయి వేసి చిరు నవ్వులు చిందిస్తూ కనిపించారు. ఇందుకు సంబంధించిన ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. సాధారణంగా రాజకీయ నాయకులు, సినీ పరిశ్రమ కి చెందిన పలువురు ప్రముఖులు తరచూ పలు కార్యక్రమాల్లో కలవడం మనం చూస్తూనే ఉంటాం.
తాజాగా మెగా బ్రదర్స్ అయిన మెగాస్టార్ చిరంజీవి, పవన్ కళ్యాణ్ లు ఇద్దరు కూడా రాజకీయ నాయకులు అయిన మండలి బుద్ధ ప్రసాద్ గారి కొడుకు పెళ్లి వేడుకకు హాజరు అవ్వడం ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. ప్రస్తుతం పవన్ కళ్యాణ్ భీమ్లా నాయక్ అనే చిత్ర షూటింగ్‌తో పాటు హరిహర వీరమల్లు అనే సినిమాలతో బిజీగా ఉన్నారు. ఇక చిరంజీవి.. గాడ్ ఫాదర్ అనే సినిమా చేస్తున్నాడు. ఇటీవల మెగాస్టార్ చిరంజీవి చేతికి సర్జరీ కావడంతో కొద్ది రోజుల పాటు విశ్రాంతి తీసుకుంటున్నారు. అన్నయ్యతో పవన్ కళ్యాణ్ చిరునవ్వులు చిందించడం లాంటి ఫోటోలు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి.