80, 90ల నాటి హీరో, హీరోయిన్ల రేర్ పిక్స్, వాటి వెనుకున్న స్టోరీ గురించి తెలిస్తే.. ఇప్పటి తరం వాళ్లకి ఆశ్చర్యంగా అనిపిస్తుంటుంది. సోషల్ మీడియా పుణ్యమా అని అలాంటి అరుదైన చిత్రాలు, సందర్భాలు వెలుగులోకి వస్తున్నాయి.
80, 90ల నాటి హీరో, హీరోయిన్ల రేర్ పిక్స్, వాటి వెనుకున్న స్టోరీ గురించి తెలిస్తే.. ఇప్పటి తరం వాళ్లకి ఆశ్చర్యంగా అనిపిస్తుంటుంది. సోషల్ మీడియా పుణ్యమా అని అలాంటి అరుదైన చిత్రాలు, సందర్భాలు వెలుగులోకి వస్తున్నాయి. మెగాస్టార్ చిరంజీవి ఓ నటిని ముద్దాడుతున్న ఫోటో ఒకటి తెగ వైరల్ అవుతోంది. అప్పుడు చిరు పక్కన కథానాయికగా నటించిన ఆమె.. ఆ తర్వాత లేడీ విలన్‌గా, క్యారెక్టర్ ఆర్టిస్ట్‌గా మారి ప్రస్తుతం సీరియల్స్‌లో కనిపిస్తున్నారు. ఆమె ఎవరో కాదు, సీనియర్ నటి నళిని. ఒకప్పుడు కథానాయికలుగా చేసి, తర్వాత క్యారెక్టర్ ఆర్టిస్టుగా మారి గుర్తింపు తెచ్చుకున్న వారు ఎంతో మంది ఉన్నారు. కానీ నళినికి హీరోయిన్‌గా అనుకున్నంత గుర్తింపు దక్కలేదు.
రవితేజ ‘వీడే’, నందమూరి హరికృష్ణ ‘సీతయ్య’ సినిమాల్లో లేడీ విలన్‌గా ఆకట్టుకున్న నళిని.. చిరంజీవి సరసన ‘సంఘర్షణ’ (1983), ‘ఇంటిగుట్టు’ (1984) చిత్రాల్లో నటించారు. అంతకుముందు 1981లో తమిళంలో సూపర్ స్టార్ రజినీ కాంత్ – చిరంజీవి కలిసి చేసిన ‘రణువ వీరన్’ తో నళిని కెరీర్ స్టార్ట్ అయింది. ఈ చిత్రం తెలుగులో ‘బందిపోటు సింహం’ పేరుతో డబ్ అయింది.
అప్పటి నుంచి 1988 వరకు సంవత్సరానికి 5 నుండి 20 సినిమాల వరకు చేసేవారు. 2002లో క్యారెక్టర్ ఆర్టిస్టుగా సెకండ్ ఇన్నింగ్స్ స్టార్ట్ చేశారు. తెలుగులో చివరిగా ‘బ్రాండ్ బాబు’ లో కనిపించిన నళిని.. బుల్లితెర ప్రేక్షకులను అలరించారు. ‘అమ్మ నా కోడలా’, ‘భాగ్యరేఖ’ తర్వాత ‘జానకి కలగనలేదు’ సీరియల్‌లో కనిపించారు. మెగాస్టార్, నళినిని ముద్దాడుతున్న ఈ రేర్ రొమాంటిక్ పిక్ ‘సంఘర్షణ’ సినిమాలోనిది.