సినిమా ఇండస్ట్రీలో స్టార్ వార్ అన్నది సర్వ సాధారణం. ఇద్దరు హీరోలు నేరుగా గొడవ పడకపోయినా.. వారి సినిమాలు ఒకదానితో ఒకటి పోటీ పడుతూనే ఉంటాయి. ముఖ్యంగా పండగల సందర్భంలో. తెలుగు నాట సంక్రాంతికి పెద్ద సినిమాలు విడుదల చేయటం ఎన్నో ఏళ్లనుంచి వస్తోంది. ఇలా ఇండస్ట్రీలో సంక్రాంతికి తమ సినిమాలు విడుదల చేసి పోటీ పడ్డ స్టార్ హీరోల్లో మెగాస్టార్ చిరంజీవి- నందమూరి నటసింహం బాలకృష్ణల ద్వయం ఒకటి. వీరిద్దరూ దాదాపు 30 ఏళ్లుగా చాలా సార్లు సంక్రాంతికి తమ సినిమాలతో పోటీ పడ్డారు. ఓసారి ఒకరి సినిమా మంచి విజయాన్ని సాధిస్తే.. మరోసారి మరొకరి సినిమా మంచి ఫలితాలను రాబట్టింది.
ఇప్పటివరకు వీరిద్దరూ 9 సార్లు సంక్రాంతి బరిలో నిలిచారు. మరోసారి కూడా సంక్రాంతి బరిలో నిలవటానికి సిద్దంగా ఉన్నారు. 2023 సంక్రాంతి సందర్భంగా చిరంజీవి నటిస్తున్న వాల్తేరు వీరయ్య, బాలకృష్ణ నటిస్తున్న వీర సింహారెడ్డి సినిమాలు థియేటర్లలో పోటీకి దిగనున్నాయి. మరి, వీరిలో వీరయ్య గెలుస్తాడా? లేక వీర సింహారెడ్డి గెలుస్తాడా? అన్నది ప్రేక్షకులే నిర్ణయిస్తారు. అంతా బాగుంటే రెండు సినిమాలు మంచిగా ఆడే అవకాశం ఉంది. మరి, గతంలో ఈ ఇద్దరు స్టార్ హీరోలు ఏఏ సినిమాలతో పోటీకి దిగారు? ఆ సినిమాలు మంచి విజయాన్ని సాధించాయా? లేదా? అన్నది ఇప్పుడు తెలుసుకుందాం.