మెగాస్టార్ చిరంజీవి మూవీ సెట్ లో భారీ అగ్నిప్రమాదం. 20 ఎకరాల్లో ఉన్నదంతా కూడా పూర్తిగా కాలిబూడిద అయిపోయింది. ఆ ఒక్క చిన్న తప్పే ఈ భారీ నష్టానికి కారణమని తెలుస్తోంది. ఇంతకీ ఏం జరిగింది?
మెగాస్టార్ చిరంజీవి సినిమా సెట్ లో భారీ అగ్ని ప్రమాదం జరిగింది. దాదాపు 20 ఎకరాల్లో ఉన్న సెట్ అంతా కూడా కాలిబూడిదైంది. అయితే ఇది జరిగింది ప్రస్తుతం చేస్తున్న మూవీ సెట్ లో కాదు. గతంలో చిరు-చరణ్ కలిసి నటించిన ‘ఆచార్య’ కోసం ధర్మస్థలిని రూపొందించారు. షూటింగ్ పూర్తయి, థియేటర్లలో మూవీ రిలీజ్ అయిపోయినా సరే దాన్ని అలానే ఉంచేశారు. ఇప్పుడు ఇక్కడే మంటలు చెలరేగాయి. అగ్నికీలలు దట్టంగా వ్యాపించడం, అందుకు సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ కావడంతో అసలు విషయం వెలుగులోకి వచ్చింది. దీనికి కారణం ఏంటన్నది కూడా దాదాపు తెలిసిపోయింది.
ఇక వివరాల్లోకి వెళ్తే.. కొరటాల శివ డైరెక్షన్ లో మెగాస్టార్ చిరంజీవి నటించిన సినిమా ‘ఆచార్య’. ఈ మూవీ కోసం కోకాపేట లేక దగ్గర ఉన్న 20 ఎకరాల్లో దాదాపు రూ.23 కోట్లు ఖర్చు చేసి ధర్మస్థలి పేరుతో టెంపుల్ సెట్ ని నిర్మించారు. విజువల్ వండర్ లా ఉన్న ఈ సెట్ ని షూటింగ్ తర్వాత తీసేయకుండా అలానే ఉంచేశారు. ప్రైవేట్ ఫామ్ హౌస్ లో ఉన్నది కావడం వల్ల బహుశా ఇలా చేసినట్లు తెలుస్తోంది. ఇప్పుడు ఇక్కడే మంటలు చెలరేగాయి. సోమవారం సాయంత్రం 6 గంటల టైంలో దట్టమైన అగ్నికీలలు కనిపించడంతో సమీపంలోని ప్రజలు ఫైర్ సిబ్బందికి సమాచారం అందించారు. వెంటనే వారు వచ్చి మంటల్ని అదుపులోకి తీసుకొచ్చారు.
సెట్ మొత్తం పూర్తిగా కాలిబూడిదైనప్పటికీ.. ఎలాంటి ప్రాణనష్టం జరగకపోవడంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు. ఈ భారీ టెంపుల్ సెట్ ని ఆర్ట్ డైరెక్టర్ సురేష్.. స్పెషల్ కేర్ తీసుకుని మరీ డిజైన్ చేశారు. గాలి గోపురం నుంచి ప్రతిదీ కూడా చాలా హైలెట్ గా తీర్చిదిద్దారు. ఇది చాలా విషయాల్లో హైలెట్ గా నిలిచింది. అలాంటి ఈ సెట్ లో మంటలు ఎలా చెలరేగాయి? నిప్పు ఎక్కడ నుంచి వచ్చింది అనేది తెలియాల్సి ఉంది. అయితే సెట్ బయట ఓ వ్యక్తి సిగరెట్ తాగి పడేయడంతో ఆ మంటలు సెట్ కి తగులుకున్నట్లు తెలుస్తుంది. అలా మొత్తం కాలిపోయిందని మాట్లాడుకుంటున్నారు. మరి ఇందులో నిజమెంత ఉందనేది తెలియాల్సి ఉంది. మరి ‘ఆచార్య’ సెట్ అగ్నికి అహుతి కావడంపై మీరేం అంటారు. కింద కామెంట్ చేయండి.