Chiranjeevi: ‘‘ తల్లిదండ్రులకు పుత్రోత్సాహం కలిగేది కొడుకు పుట్టినపుడు కాదు.. ఆ కొడుకు సంస్కారవంతుడిగా ఎదిగి, అందరూ అతణ్ని పొగుడుతున్నప్పుడు’’ అన్నాడు సంత్ కబీర్‌దాసు. ఆ మాట కొస్తే మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ విషయంలో మెగాస్టార్ చిరంజీవికి ప్రస్తుతం అసలు సిసలైన పుత్రోత్సాహం కలుగుతోందని చెప్పొచ్చు. ‘‘రంగస్థలం’’ సినిమాతో నటనలో తానేంటో నిరూపించుకున్న చరణ్, ‘‘ ఆర్‌ఆర్‌ఆర్’’ సినిమాతో పాన్ ఇండియా స్టార్‌గా దేశ వ్యాప్త గుర్తింపు తెచ్చుకున్నాడు. ఒక రకంగా తండ్రిని మించిన కుమారుడు అనిపించుకుంటున్నాడు. ఈ విషయాన్నే గతంలో చిరంజీవి ప్రస్తావించారు. నటన విషయంలో రామ్ చరణ్ తనకంటే డేరింగ్ అంటూ చిరంజీవి ఓ సందర్భంలో చెప్పుకొచ్చారు. మెగా కోడలు ఉపాసనతో జరిపిన ఆ ఇంటర్వ్యూలో ఉపాసన చిరును ఓ ప్రశ్న అడిగారు. రామ్ చరణ్‌కు మగధీర, రంగస్థలం రెండు ఇండస్ట్రీ హిట్లు ఉన్నాయి. దేశంలోనే అత్యంత యంగ్ ప్రొడ్యూసర్‌గా వందల కోట్ల రూపాయల సినిమాలు తెరకెక్కిస్తున్నారు. ఓ తండ్రిగా మిమ్మల్ని చరణ్ సంతోష పెట్టారా? మీ అంచనాలను ఆయన అందుకున్నారా? అని ఉపాసన చిరంజీవిని అడగ్గా..
చిరంజీవి సమాధానం ఇస్తూ.. ‘‘ చరణ్ నా కొడుకైనందుకు మనస్పూర్తిగా నేను గర్వపడుతున్నా. ‘మీరే మీ జీవితంలో ఏం సాధించారు’ అని ఎవరైనా నన్ను అడిగితే.. ‘నేను రామ్ చరణ్‌లాంటి బిడ్డను సాధించాను’ అని గర్వంగా చెబుతాను. చరణ్ నా వారసత్వాన్ని కొనసాగిస్తాడన్న నమ్మకం నూటికి నూరు శాతం ఉంది. రామ్ చరణ్ ‘‘రంగస్థలం’’ సినిమాలో వినికిడి సమస్య ఉన్న వ్యక్తిగా నటించాడు. అలాంటి క్యారెక్టర్ విషయంలో నేనైతే రిస్క్ తీసుకునేవాడిని కాదు. అలాంటి పాత్ర నా దగ్గరకు వచ్చుంటే నేనైతే కుదరదని చెప్పేవాడ్ని. కానీ, చరణ్ ఎంతో ధైర్యంగా చేశాడు. పాత్రలో లీనమయ్యాడు. అద్భుతంగా నటించాడు. అందరితే శభాష్ అనిపించుకున్నాడు. చరణ్‌ను చూస్తే నాకు గర్వంగా ఉంది’’ అంటూ కుమారుడ్ని పొగడ్తలతో ముంచెత్తారు. కాగా, చిరంజీవి, రామ్‌చరణ్ కలిసి కొరటాల శివ దర్శకత్వంలో తెరకెక్కిన ‘‘ఆచార్య’’లో నటించారు. కాజల్ అగర్వాల్, పూజా హెగ్డేలు హీరోయిన్లుగా చేశారు. ఈ సినిమా ఏప్రిల్ 29వ తేదీన ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. ఈ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ ఏప్రిల్ 24వ తేదీన హైదరాబాద్‌లో జరగనుంది. ఈ వేడుకకు పవర్ స్టార్ పవన్ కల్యాణ్ ముఖ్య అతిదిగా హాజరు కానున్నారు. మరి, రంగస్థలం సినిమాలో చరణ్ నటనపై మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.
ఇవి కూడా చదవండి : నాని – విజయ్ ఫ్యాన్స్ మధ్య ముదురుతున్న వార్.. ఆ సినిమానే కారణమా?