క్రేజ్.. ఓ భాష వరకే పరిమితం అయ్యేది కాదు.. కొంతమంది కొన్ని భాషలకు పరిమితం అయ్యుండొచ్చు. అసలు వేరే భాషలలో నటించకపోవచ్చు. కానీ.. క్రేజ్ మాత్రం ఏదో విధంగా భాషలు దాటుకొని దేశవ్యాప్తంగా విస్తరిస్తుంది. ఇప్పుడు మనం పైన ఫొటోలో చూస్తున్న చిన్నారి క్రేజ్ కూడా అంతే.
సినీ హీరోయిన్స్ పై ఫ్యాన్ క్రేజ్.. ఓ భాష వరకే పరిమితం అయ్యేది కాదు.. కొంతమంది కొన్ని భాషలకు పరిమితం అయ్యుండొచ్చు. అసలు వేరే భాషలలో నటించకపోవచ్చు. కానీ.. క్రేజ్ మాత్రం ఏదో విధంగా భాషలు దాటుకొని దేశవ్యాప్తంగా విస్తరిస్తుంది. ఇప్పుడు మనం పైన ఫొటోలో చూస్తున్న చిన్నారి క్రేజ్ కూడా అంతే. సినిమాలన్నీ సౌత్ లోనే చేసినా.. ఇండియా వైడ్ తనకంటూ ప్రత్యేక గుర్తింపు సంపాదించుకుంది. పైగా క్రేజ్ కోసం తపనపడే రకం కూడా కాదు. ఎంతో ముద్దుగా.. రెండు పిలకలతో మురిపిస్తున్న ఈ వయ్యారికి.. సౌత్ ఇండియా మొత్తం దాసోహం అంటోంది. అంతటి క్రేజ్ అందం వల్ల కాదు.. అద్భుతమైన నటన, డ్యాన్సింగ్ స్కిల్స్ తో సొంతం చేసుకుంది.
మరి స్టార్ హీరోయిన్ స్టేటస్ కోసం అందాలన్నీ ఆరబోసే అవసరం లేదని ప్రూవ్ చేసి.. ఎంతోమందికి ఇన్స్పిరిషన్ గా నిలిచింది. చక్కగా చిన్నతనంలోనే ఫోటోలకు పోజులిచ్చిన ఈ బ్యూటీ.. తన ప్యూర్ టాలెంట్ తో కోట్లాది ఫ్యాన్స్ ని వెనకేసుకుంది. ఈ పాటికే గుర్తు వచ్చి ఉండాలే.. ఎవరో అర్థమైందా? సాయిపల్లవి. నేచురల్ బ్యూటీగా, లేడీ పవర్ స్టార్ గా ఎదిగిన సాయిపల్లవి.. మొదటి నుండి ఎలాంటి గ్లామర్ షోకి పోకుండా.. ఆచితూచి సినిమాలను ఎంపిక చేసుకుంటూ దూసుకుపోతోంది. ప్రేమమ్ సినిమాతో హీరోయిన్ గా ఫస్ట్ బిగ్ హిట్ అందుకున్న సాయిపల్లవి.. తెలుగులో ఫిదా సినిమాతో డెబ్యూ చేసి బ్లాక్ బస్టర్ ఖాతాలో వేసుకుంది.
అక్కడినుండి టాలీవుడ్ తో పాటు సౌత్ ఇండియా మొత్తం సాయిపల్లవి క్రేజ్ పాకింది. ఇంకేముంది.. వరుసగా యంగ్ హీరోల సరసన సినిమాలు చేస్తూ.. హీరోలను డామినేట్ చేసే విధంగా పేరు తెచ్చుకుంది. సాయిపల్లవికి తెలుగులోనే విపరీతమైన ఫ్యాన్ బేస్ ఉంది. ఆమెను స్క్రీన్ పై చూసి పండగ చేసుకునే ఫ్యాన్స్ సంఖ్య.. రోజురోజుకూ పెరుగుతూనే ఉందంటే అతిశయోక్తి కాదు. లవ్ స్టోరీ, శ్యామ్ సింగరాయ్ సినిమాలతో బ్లాక్ బస్టర్స్ అందుకున్న ఈ లేడీ పవర్ స్టార్.. చివరిగా విరాటపర్వం, గార్గి సినిమాలలో నటించింది. ప్రస్తుతానికి తమిళంలో శివకార్తికేయన్ సరసన ఓ సినిమా చేస్తోంది. ఇదిలా ఉండగా.. సాయిపల్లవి చిన్ననాటి ఫోటో నెట్టింట వైరల్ గా మారింది. మరి సాయిపల్లవి చైల్డ్ హుడ్ పిక్ పై మీ అభిప్రాయాలను కామెంట్స్ లో తెలపండి.