టాలీవుడ్ కు ఎంతో మంది నటీమణులు వస్తుంటారు. తమను తాము నిరూపించుకునేందుకు తపనపడుతుంటారు. పెద్ద హీరోలతో చేస్తే వరుస ఆఫర్లు వస్తుంటాయని భావిస్తుంటారు. కానీ ఈ నటికి మాత్రం.. పెద్ద పెద్ద హీరోలతో ఆడిపాడినప్పటికీ.. హీరోయిన్ గా నిలదొక్కుకోలేకపోయింది. ఆమె ఎవరంటే..?
సినిమాల మీద ఫ్యాషన్‌తో చాలా మంది నటీమణులు చిత్ర పరిశ్రమకు వస్తుంటారు. తమను తాము నిరూపించుకునేందుకు ప్రయత్నిస్తుంటారు. చిన్న సినిమాలతో పరిచయమైనా.. పెద్ద హీరోల పక్కన నటించాలని అనుకుంటారు. ఆ అవకాశాల కోసం ఎదురుచూస్తూ ఉంటారు. అయితే కొంత నటీమణులు మంచి కథల్లో, పెద్ద స్టార్ హీరోలు పక్కన చేసినా.. మరో అవకాశం రావడం లేదు. అటువంటి నటీమణుల్లో ఆమె కూడా ఒకరు. చాలా టాలెంట్ ఉన్నా, గుర్తింపు వస్తున్నా.. సినిమా అవకాశాల కోసం ఎదురు చూడాల్సిన పరిస్థితి. అలా అని మడికట్టుకుని కూర్చొవడం లేదు.. తన అందచందాలతో స్పెషల్ సాంగ్స్‌తో అలరిస్తున్నప్పటికీ.. ఇంకా ఏదో ఆమెలో దర్శకుడు రాబట్టుకోవాల్సిన టాలెంట్ మిగిలిపోయిందా అనిపిస్తుంది.
ఈ ఫోటోలో ఉన్న చిన్నదాని గురించే ఇప్పుడు మనం మాట్లాడుకునేది. చిన్నప్పుడే గరిట తిప్పేందుకు సిద్ధమైన ఈ అమ్మడు.. ఇప్పుడు అన్ని ఇండస్ట్రీలను చుట్టి వస్తోంది. అయితే ఎందుకనో తెలుగులో తనకు గుర్తింపు రావడం లేదు. ఏ మాత్రం బెరుకు లేకుండా.. హాట్ ఫోజులిస్తుంటుంది. ఆమె మరేవరో కాదూ లక్ష్మీరాయ్.. అలియాస్ రాయ్ లక్ష్మీ. కర్ణాటకలో పుట్టిన ఈ కన్నడ కస్తూరి తెలుగు, తమిళ్, కన్నడ, మలయాళంలో పాటు హిందీలోనూ నటించింది. ‘నలుపు నేరేడంటి కళ్లల్లో నువ్వే అందగాడా, నా చేయి పట్టినోడా.. తోబా,తోబా,తోబా తోబా, తోడుగుందీ ధిల్లు రూబా.. రత్తాలు రత్తాలు ఓసేసి రత్తాలు’అంటూ స్పెషల్ సాంగ్స్‌తో అలరించింది.
తొలుత తమిళ పరిశ్రమలోకి అడుగుపెట్టిన ఈ బోల్డ్ బ్యూటీ..తెలుగులో తొలిసారిగా శ్రీకాంత్ సరసన ‘కాంచనమాల కేబుల్ టీవీ’ నటించింది.ఆ తర్వాత బాలకృష్ణకు జోడీగా ‘అధినాయకుడు’లో నటించి మెప్పించింది. అయితే ఈ సినిమా డిజాస్టర్‌గా మారడంతో మిగిలిన మూడు ఇండస్ట్రీస్‌లో సినిమాలు చేసింది. కాగా, తెలుగులో రవితేజ బలుపు, పవన్ కళ్యాణ్ సర్ధార్ గబ్బర్ సింగ్, చిరంజీవితో ఖైదీ నంబర్ 150లో ఆడిపాడింది. అయినప్పటికీ ఆమెకు హీరోయిన్‌గా తెలుగులో పెద్ద అవకాశాలు రాలేదు. వేరీజ్ ద వెంకటలక్ష్మి సినిమా తర్వాత ఆమె టాలీవుడ్ లో కనిపించలేదు. డబ్బింగ్ సినిమాలతో పలకరిస్తుంది. పనిలో పనిగా బాలీవుడ్ పై పాగా వేసేందుకు సిద్దమైంది.
అకీరా, జూలీ-2 వంటి థ్రిల్లింగ్ మూవీస్‌లో తన బోల్డ్ నటనతో కట్టిపడేసింది. ఆ తర్వాత ‘పాయిజన్-2’ వెబ్ సిరీస్‌తో ఆడియన్స్ ముందుకు వచ్చింది. ఎప్పుడు సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉంటూ.. తన ఫోటోలను షేర్ చేస్తూ ఉంటుంది. ఖైదీ రీమేక్ గా వచ్చిన భోళా సినిమాలో ఓ స్పెషల్ సాంగ్ చేయగా.. బాగా హిట్ అయ్యింది. ప్రస్తుతం ఆ భామ మలయాళంలో డిఎన్ఎ సినిమాలో చేస్తోంది. అందులో ఐపీఎస్ ఆఫీసర్ పాత్రలో కనిపించనుంది. వీరితో పాటు మరికొన్ని సినిమాలు చేస్తోంది. కాగా, ఆమె ఈ శుక్రవారానికి 34 ఏళ్లు నిండనున్నాయి. ఈ రోజు ఆమె పుట్టిన రోజు జరుపుకుంటుంది. ఈ సినిమాలతోనైనా తెలుగులో బిజీ హీరోయిన్ కావాలని ఆకాంక్షిద్దాం. మీరేమంటారో కామెంట్లో తెలియజేయండి.