టాలీవుడ్ లో యాక్టర్స్ కు కొదవలేదు. మరీ ముఖ్యంగా చాలామంది చైల్డ్ ఆర్టిస్టులు.. తెలుగువాళ్లు కాకపోయినప్పటికీ మన ప్రేక్షకుల మనసులు గెలుచుకుంటూ ఉంటారు. అప్పట్లో చాలా ఫేమస్ అయిన ఓ చిన్నారి.. చిరంజీవి, మహేష్ బాబు, రామ్ చరణ్ లాంటి స్టార్ స్క్రీన్ షేర్ చేసుకుంది. ఇప్పుడు పెరిగి పెద్దదయింది. హీరోయిన్లకు ఏ మాత్రం తీసిపోదు అనేలా తయారైంది. ఫిజిక్ కూడా మంచిగానే మెంటైన్ చేస్తోంది. సోషల్ మీడియాలోనూ ఆమెకు నాలుగు లక్షలకు పైగా ఫాలోవర్స్ ఉండటం విశేషం. ఇంతకీ ఆమె ఎవరో గుర్తుపట్టారా?
ఇక వివరాల్లోకి వెళ్తే.. తెలుగులో దాదాపు ఏడు సినిమాల్లో యాక్ట్ చేసిన ఈమె పేరు శ్రియశర్మ. మెగాస్టార్ చిరంజీవి ‘జై చిరంజీవ’ సినిమాలో ఆయన మేనకోడలి పాత్రలో క్యూట్ గా భలే ముద్దొచ్చేలా నటించింది. టాలీవుడ్ ఆడియెన్స్ మనసు దోచేసింది. ఆ తర్వాత తమిళ, కన్నడలో చైల్డ్ ఆర్టిస్టుగా బిజీ అయిన శ్రియ.. మహేష్ బాబు దూకుడులో సమంత చెల్లిలిగా కనిపించి ఆకట్టుకుంది. రచ్చ, ఎటో వెళ్లిపోయింది మనసు, తూనీగ తూనీగ లాంటి సినిమాల్లో చిన్నప్పటి పాత్రల్లో నటించి మెప్పించింది. ‘గాయకుడు’, ‘నిర్మలా కాన్వెంట్’ సినిమాల్లో హీరోయిన్ రోల్స్ చేసి ఆకట్టుకుంది.
సినిమాలతోపాటు చైల్డ్ ఆర్టిస్టుగా హిందీలో పలు సీరియల్స్ చేసి శ్రియ శర్మది ఉత్తరప్రదేశ్. తండ్రి ఇంజనీర్, తల్లి డైటీషియన్. పుట్టిన నాలుగేళ్లకే యాక్టర్ గా మారిన శ్రియ.. తన కెరీర్ లో ఓసారి నేషనల్ అవార్డు కూడా అందుకోవడం విశేషం. యాక్టర్ కమ్ మోడల్ గా ఎంతోమందికి తెలిసిన శ్రియశర్మ.. న్యాయవాద విద్య పూర్తిచేసి ప్రస్తుతం లాయర్ గా ప్రాక్టీసు చేస్తోంది. ఇలా మల్టీ టాలెంటెడ్ అయిన ఈమె ఇప్పుడు మాత్రం చాలామంది యంగ్ హీరోయిన్లకు పోటీ ఇచ్చేలా ఉంది. కానీ ఎందుకో యాక్టింగ్ ని అయితే పక్కన పెట్టేసింది. చూడాలి లాయర్ ప్రాక్టీస్ అయిపోయిన తర్వాత ఏమైనా హీరోయిన్ గా చేస్తుందా లేదా పూర్తిగా యాక్టింగ్ ని పక్కనబెట్టేసిందా అనేది తెలియాల్సి ఉంది. మరి శ్రియ పెద్దయిన తర్వాత ఎలా ఉందని మీరనుకుంటున్నారు. కింద కామెంట్ చేయండి.