టాలీవుడ్ బాక్సాఫీస్ వద్ద ఛత్రపతి సృష్టించిన ప్రభంజనం అంతా ఇంతా కాదు. రాజమౌళి దర్శకత్వంలో తెరకెక్కిన ఈ మూవీ.. ప్రభాస్ రేంజ్ ఏమిటో ప్రేక్షకులకి అర్ధం అయ్యేలా చేసింది. ఈ సినిమా తరువాత డార్లింగ్ కి విపరీతమైన మాస్ ఫాలోయింగ్ వచ్చేసింది. అయితే.., ఇందులో ఒక్క ప్రభాస్ క్యారెక్టర్ మాత్రమే కాదు.., మిగతా అన్నీ పాత్రలు బాగుంటాయి. ముఖ్యంగా.. కాట్ రాజ్ చేతిలో దెబ్బలు తిని.., పడిపోయే సూరీడు క్యారెక్టర్ కూడా ఛత్రపతి సినిమాకి పెద్ద ఎస్సెట్. అసలు ఈ సినిమాలో హీరో క్యారెక్టర్ ఎస్టాబ్లిష్ అయ్యేదే సూరీడు పాత్ర వల్ల. ఇంతటి మంచి పాత్రలో అద్భుతంగా నటించిన ఆ చైల్డ్ ఆర్టిస్ట్ పేర భశ్వంత్ వంశీ.
ఛత్రపతి సినిమా ఆడిషన్స్ కోసం ఎంతో మంది పిల్లలను టెస్ట్ చేయగా.., జక్కనకి అప్పట్లో భశ్వంత్ వంశీ బాగా నచ్చాడట. అతని అమాయకపు చూపులు సినిమాకి ప్లస్ అవుతాయని రాజమౌళి బలంగా నమ్మి అవకాశం ఇచ్చాడు. అందుకు తగ్గట్టే సూరీడు, అతని తల్లి క్యారెక్టర్ మధ్య ఎమోషన్ అద్భుతంగా పండింది. ఇక ఛత్రపతి తర్వాత కూడా భశ్వంత్ వంశీ కొన్ని సినిమాల్లో మెరిశాడు. అయితే.., గత కొంత కాలంగా భశ్వంత్ వంశీ కెమెరా ముందుకి రాకపోవడంతో అతన్ని ప్రేక్షకులు మరచిపోయారు. కట్ చేస్తే.. ఇప్పుడు అందరికీ షాక్ ఇస్తూ.., భశ్వంత్ వంశీ హీరో లుక్స్ తో ప్రేక్షకుల ముందుకి వచ్చాడు.
ఛత్రపతి సినిమాలో భశ్వంత్ వంశీ, అనిత చౌదరీ తల్లీకొడుకులుగా నటించిన విషయం తెలిసిందే కదా! తాజాగా వీరిద్దరూ కలిసి దిగిన సెల్ఫీ ఒకటి వైరల్ అవుతోంది. ఇందులో గడ్డం, మీసాలతో సూరీడు గుర్తుపట్టరానంతగా మారిపోయాడంటూ నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు. ఇక విదేశాల్లో చదువు పూర్తి చేసుకున్న అతడు టాలీవుడ్‌లో మంచి అవకాశాల కోసం ఎదురు చూస్తున్నాడట. అంటే.. భశ్వంత్ వంశీ హీరోగా ఎంట్రీ ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాడన్న మాట. మరి.., ఒకప్పటి ఛత్రపతి సూరీడు హీరో లుక్స్ లో ఇప్పుడు ఎలా ఉన్నాడు? మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియచేయండి.