బెల్లంకొండ హీరోకి అస్సలు కలిసిరాలేదు. బాలీవుడ్ లో గ్రాండ్ గా ఎంట్రీ ఇవ్వాలనుకున్నాడు. 'ఛత్రపతి' తొలిరోజు కలెక్షన్స్ తో బొక్కబోర్లా పడినట్లు తెలుస్తోంది. ఇంతకీ ఏంటి విషయం?
బెల్లంకొండ శ్రీనివాస్.. తెలుగు హీరోగా ఒకటో రెండో హిట్స్ కొట్టినట్లు గుర్తు! కాస్తో కూస్తో పేరు అయితే తెచ్చుకున్నాడు. టాలీవుడ్ లో అంతంత మాత్రంగా ఉన్న కెరీర్ ని పణంగా పెట్టి మరీ బాలీవుడ్ ఎంట్రీ ఇచ్చాడు. దాదాపు 18 ఏళ్ల క్రితం ప్రభాస్-రాజమౌళి కాంబోలో వచ్చిన ‘ఛత్రపతి’ని హిందీలో రీమేక్ చేసి, హీరోగా నటించాడు. తాజాగా ఆ మూవీ థియేటర్లలోకి వచ్చింది. రిలీజ్ కి ముందే ట్రోలింగ్ కి గురైన ఈ చిత్రం.. అందుకు తగ్గట్లే తొలిరోజు వసూళ్లని అందుకుంది. మరీ దారుణంగా కలెక్షన్స్ వచ్చినట్లు తెలుస్తోంది. ఇంతకీ ఎన్ని డబ్బులొచ్చాయి? ఏంటి సంగతి?
అసలు విషయానికొస్తే.. ‘ఛత్రపతి’ పేరు చెప్పగానే ప్రభాస్ పవర్ ఫుల్ ఫెర్ఫార్మెన్స్ గుర్తొస్తుంది. అలాంటిది ఆ మూవీని, అది కూడా ఇప్పుడు రీమేక్ చేస్తున్నారగానే అందరూ అవాక్కయ్యారు. బెల్లంకొండ శ్రీనివాస్ హీరో అనేసరికి కోలుకోలేనంత షాక్ లోకి వెళ్లిపోయారు. తాజాగా హిందీ ‘ఛత్రపతి’ థియేటర్లలోకి వచ్చింది. కానీ ఘోరమైన టాక్ తెచ్చుకుంది. ఒక్కరూ కూడా పాజిటివ్ గా రెస్పాన్స్ కావడం లేదు. నార్త్ ఆడియెన్స్ అయితే సినిమాని ట్రోల్ చేస్తున్నారు. ఈ ఎఫెక్ట్ ఫస్ట్ డే కలెక్షన్స్ పై గట్టిగా పడింది. చాలా దారుణంగా వచ్చాయని తెలుస్తోంది.
హిందీలో రీమేక్ ‘ఛత్రపతి’ మూవీకి మన దేశమంతా కలిపితే తొలిరోజు కేవలం రూ.60 లక్షలు మాత్రమే నెట్ కలెక్షన్స్ వచ్చినట్లు తెలుస్తోంది. ఇది చూసి తెలుగు నెటిజన్స్ ఫన్నీ ట్రోల్స్ చేస్తున్నారు. అయితే ఈ మూవీని రీమేక్ చేసి, సేఫ్ గేమ్ ఆడొచ్చని అనుకున్నారు కానీ కీలకమైన ఎమోషన్ ని మిస్ అయినట్లు మూవీ చూసిన ఆడియెన్స్ చెబుతున్నారు. యాక్షన్, ఫైట్స్ తప్పితే సినిమాలో చెప్పుకోవడానికి ఒక్క పాయింట్ కూడా లేదని మాట్లాడుకుంటున్నారు. సరే ఇదంతా పక్కనబెడితే ‘ఛత్రపతి’ మొదటిరోజు కలెక్షన్స్ చూసిన తర్వాత మీకేం అనిపించింది? కింద కామెంట్ చేయండి.