ఒక పాల బుగ్గల క్యూట్ గర్ల్ ఫొటో ఇప్పుడు నెట్టింట వైరల్ అవుతోంది. ఆమె హీరోయినే కాదు.. పాన్ ఇండియా ప్రొడ్యూసర్ కూడా కావడం విశేషం.
సినీ తారల గురించి తెలుసుకోవాలనే కుతూహలం వారి అభిమానులతో పాటు సాధారణ ప్రేక్షకుల్లోనూ ఎక్కువగా ఉంటుంది. సెలబ్రిటీల వ్యక్తిగత జీవితానికి సంబంధించిన విశేషాలను తెలుసుకోవాలనే ఆసక్తి అందరిలోనూ ఉంటుంటి. అందుకే వారికి సంబంధించిన ఏ చిన్న విషయం బయటకు వచ్చినా ఇట్టే పాపులర్ అయిపోతుంది. ముఖ్యంగా స్టార్స్ చిన్నప్పటి ఫొటోలు నెట్టింట బాగా చక్కర్లు కొడుతుంటాయి. ఇప్పుడు అలాంటి ఒక హీరోయిన్ ఫొటో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఈ అందాల భామ ఒకప్పుడు స్టార్ హీరోయిన్గా టాలీవుడ్లో రాణించారు. జూనియర్ ఎన్టీఆర్, ప్రభాస్, బాలకృష్ణ, వెంకటేష్ లాంటి టాప్ హీరోల సరసన నటించి మంచి పేరు తెచ్చుకున్నారు. తక్కువ వయసులోనే మంచి స్టార్డమ్ సంపాదించారా హీరోయిన్.
లేడీ ఓరియంటెడ్ మూవీస్ కూడా చేసిన ఆ అందాల భామ.. ఐటమ్ సాంగ్స్‌లోనూ మెరిశారు. ఆ తర్వాత నటనకు గుడ్ బై చెప్పేసిన ఆమె.. నిర్మాతగా మారి సినిమాలు తీయడం మొదలుపెట్టారు. ఆమె మరెవరో కాదు బబ్లీ బ్యూటీ ఛార్మి. ‘నీ తోడు కావాలి’తో తెలుగు చిత్ర పరిశ్రమకు పరిచయమైన ఆమె.. ఆ ఫిల్మ్ విజయం సాధించకపోయినా క్రియేటివ్ డైరెక్టర్ కృష్ణవంశీ కళ్లలో పడ్డారు. అలా ‘శ్రీ ఆంజనేయం’లో నటించే ఛాన్స్ దక్కించుకున్నారు. ఇక ఆ తర్వాత ‘అనుకోకుండా ఒక రోజు’, ‘లక్ష్మీ’, ‘స్టైల్’, ‘రాఖీ’, ‘మంత్ర’తో వరుసగా హిట్లు కొట్టారు. 2015 తర్వాత ఆమె నటనకు గుడ్ బై చెప్పారు. డాషింగ్ డైరెక్టర్ పూరీ జగన్నాథ్‌తో కలసి ఆమె సినిమాలు నిర్మిస్తున్నారు. ఆమె కో-ప్రొడ్యూసర్‌గా వ్యవహరించిన ‘లైగర్’ అట్టర్ ఫ్లాప్ అయ్యింది. త్వరలో మరో కొత్త చిత్రంతో హిట్ కొట్టేందుకు ఛార్మి రెడీ అవుతున్నారు.