Lokesh – Kamal Haasan: తమిళ సినీ ఇండస్ట్రీలో ఒక్కో సినిమాతో సంచలనం సృష్టిస్తున్న యువదర్శకుడు లోకేష్ కనకరాజ్. నగరం సినిమా మొదలుకొని.. ఖైదీ, మాస్టర్.. తాజాగా విక్రమ్ వరకూ వరుస బ్లాక్ బస్టర్స్ తో పాన్ ఇండియా దృష్టిని ఆకర్షించాడు. యంగ్ డైరెక్టర్ అయిన లోకేష్ స్టార్స్ తో సినిమాలు చేస్తూ.. తన టేకింగ్ తో అందరినీ ఆకట్టుకుంటున్నాడు. లోకేష్ టేకింగ్ పై ఇండస్ట్రీ ప్రముఖులు సైతం ప్రశంసలు కురిపిస్తుండటం మనం చూస్తూనే ఉన్నాం.
ఈ క్రమంలో లోకేష్ కనకరాజ్.. విశ్వనటుడు కమల్ హాసన్ కి వీరాభిమాని అనే సంగతి తెలిసిందే. ఆయనను, ఆయన సినిమాలను స్ఫూర్తిగా తీసుకొని సినిమాలు చేస్తున్నానని ఇదివరకే మీడియా ముఖంగా చెప్పేశాడు. అదీగాక.. కమల్ హాసన్ తో లోకేష్ తెరకెక్కించిన లేటెస్ట్ బ్లాక్ బస్టర్ విక్రమ్.. 1986లో కమల్ నటించిన విక్రమ్ సినిమాతో.. 2019లో కార్తీతో తెరకెక్కించిన ఖైదీ సినిమాలతో లింక్ చేసి చూపించి మెప్పించాడు.
ఇక ఇప్పుడు తాజాగా కమల్ ని లోకేష్ ఓ అభిమానిగా ఎంతలా ఆదరిస్తాడో.. తన సినిమాలలో హీరోలు కనిపించే తీరును చూస్తే తెలిసిపోతుంది. లోకేష్ తీసే ప్రతి సినిమాకు గతంలో కమల్ చేసిన పాత్రలు, సినిమాలను రిఫరెన్స్ లుగా తీసుకోవడం మనం గమనించవచ్చు. అలాగే తన ప్రతి సినిమా ఎండింగ్ టైటిల్స్ లో లోకేష్ స్పష్టంగా కమల్ హాసన్ నటించిన ఫలానా సినిమా నుండి ఇన్స్పైర్ అయి ఈ సినిమా తీశానని మెన్షన్ చేస్తుంటాడు.
ఆ విధంగా చూసుకుంటే.. లోకేష్ డెబ్యూ మూవీ నగరం. ఈ సినిమాలో హీరో సందీప్ కిషన్ లుక్ చూసినట్లయితే.. కమల్ హాసన్ నటించిన ‘సత్య’ సినిమా లుక్ కనిపిస్తుంది. అదేవిధంగా.. ఖైదీలో కార్తీ లుక్.. పోతురాజులో కమల్ లుక్ పోలిఉంటుంది.. అలాగే మాస్టర్ లో దళపతి విజయ్ లుక్ చూస్తే.. 1995లో కమల్ చేసిన ‘నమ్మవర్’ లుక్ పోలి ఉండటం విశేషం. అలాగే ఈ సినిమాలకు ఎండింగ్ లో కమల్ సినిమాలను మెన్షన్ చేసి తన అభిమానాన్ని చాటుకున్నాడు.
ఈ క్రమంలో లోకేష్ కనకరాజ్.. కమల్ సినిమాలను చూసి ఏ స్థాయిలో ఇన్స్పైర్ అయ్యాడో.. ఆ క్యారెక్టర్స్ లుక్.. తాను తెరకెక్కిస్తున్న సినిమాలలో హీరోల లుక్స్ చూస్తే ఆ ప్రభావం కనిపిస్తుంది. ప్రస్తుతం సోషల్ మీడియాలో లోకేష్ తెరకెక్కించిన నగరం, ఖైదీ, మాస్టర్, విక్రమ్.. సినిమాలను గతంలో కమల్ పోషించిన పాత్రలతో కంపేర్ చేస్తూ పోస్టులు పెడుతున్నారు ఫ్యాన్స్. ఈ నేపథ్యంలో లోకేష్ సినిమా కథలన్నీ.. కమల్ చేసిన పాత్రల నుండే పుట్టాయా..? లేదా కమల్ చేసిన పాత్రలనే లోకేష్ సినిమాలుగా తీస్తున్నాడా? అనే అభిప్రాయాలు వెలువడుతున్నాయి. మరి లోకేష్ కనకరాజ్ సినిమాలపై మీ అభిప్రాయాలను కామెంట్స్ లో తెలియజేయండి.
#LokeshKanagaraj and his fanism towards #KamalHaasan sir 🙌🏻
His lead characters looks resemble looks of Kamal sir from old movies ❤#Maanagaram #Kaithi #Master #Vikram pic.twitter.com/2UPWcPzr2h
— Thyview (@Thyview) June 15, 2022
#LokeshKanagaraj – Pure #KamalHaasan Veriyan 🔥💯♥️
Each of his characters are & will surely have an inspiration from any #Aandavar film..
• Maanagaram – Sathya
• #Kaithi – #Virumaandi
• #Master – Nammavar
• #Vikram – Vikram (1986)[shared] pic.twitter.com/EjeF5SQ5NE
— VCD (@VCDtweets) June 14, 2022