నటసింహం నందమూరి బాలకృష్ణ ఓవైపు సినిమాలు చేస్తూనే, మరోవైపు ‘అన్ స్టాపబుల్’ షో ద్వారా ఆహా ప్రేక్షకులను కూడా అలరిస్తున్నారు. ఇన్నాళ్లు సినిమాలలో మాస్ డైలాగ్స్ కొట్టి, థియేటర్స్ లో విజిల్స్ వేయించిన బాలయ్య.. గతేడాది ‘అన్ స్టాపబుల్’ టాక్ షో ద్వారా హోస్ట్ గా మారిన సంగతి తెలిసిందే. కెమెరా ఫియర్ అంటే తెలియని బాలయ్య.. డోంట్ కేర్ అంటూ అన్ స్టాపబుల్ మొదటి సీజన్ ని అద్భుతంగా నడిపించారు. షోకి వచ్చే గెస్ట్ లతో సరదాగా ముచ్చటిస్తూ ఎన్నో తెలియని విషయాలను చర్చించే దిశగా బాలయ్య ట్రై చేస్తుంటాడు. అయితే.. 2021లో అత్యధిక ప్రజాదరణ పొందడమే కాకుండా ఐఎండిబి రేటింగ్స్ లోనూ హైయెస్ట్ రేటింగ్ పొందింది ఈ అన్ స్టాపబుల్ షో.
ఇక ఇప్పుడు బాలయ్య అన్ స్టాపబుల్ సెకండ్ సీజన్ తో ప్రేక్షకులను అలరించేందుకు రెడీ అయిపోయాడు. అన్ స్టాపబుల్ రెండో సీజన్ షూటింగ్ కూడా ఇటీవలే మొదలైంది. అయితే.. ఈ షోలో బాలయ్య బావ, ఏపీ మాజీ సీఎం నారా చంద్రబాబు నాయుడు, ఆయన తనయుడు నారా లోకేష్ పాల్గొన్నట్లు తెలుస్తుంది. అలాగే చంద్రబాబు నాయుడు, లోకేష్ లతో ఆల్రెడీ ఎపిసోడ్ షూటింగ్ కూడా అన్ స్టాపబుల్ గా జరుగుతున్నట్లు సమాచారం. ఇదిలా ఉండగా.. దసరా సందర్భంగా ‘అన్ స్టాపబుల్ 2’ టీజర్ ని మంగళవారం సాయంత్రం విజయవాడలో లాంచ్ చేయనున్నారు. మరి బాలయ్య ఈసారి షోని నెక్స్ట్ లెవెల్ కి తీసుకెళ్లే విధంగా ప్లాన్ చేస్తున్నాడని, అందుకే గెస్ట్ లను కూడా ఆచితూచి ఎంపిక చేసుకుంటున్నాడని టాక్.
ఈ నేపథ్యంలో అన్ స్టాపబుల్ షో ద్వారా అలరించేందుకు రెడీ అవుతున్న బాలయ్య.. కెరీర్ పరంగా రెండు సినిమాలను లైనప్ చేసేశాడు. అఖండ లాంటి బ్లాక్ బస్టర్ విజయం తర్వాత బాలయ్య.. క్రాక్ ఫేమ్ గోపీచంద్ మలినేని దర్శకత్వంలో ఓ మాస్ పొలిటికల్ యాక్షన్ మూవీ చేస్తున్నాడు. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ దశలో ఉంది. ఇక ఈ సినిమా తర్వాత డైరెక్టర్ అనిల్ రావిపూడితో ఓ యాక్షన్ మూవీ చేయనున్నాడు. మొత్తానికి సినిమాల పరంగా సూపర్ స్పీడ్ పెంచేశాడు బాలయ్య. అయితే.. ఈ రెండు సినిమాల తర్వాత మరోసారి బోయపాటి శ్రీనుతో ఇంకో సినిమా చేస్తే బాగుంటుందని నందమూరి ఫ్యాన్స్ కోరుకుంటున్నారు. చూడాలి మరి బాలయ్య ఏం చేస్తాడో!