చమ్మక్ చంద్ర.. తెలుగు బుల్లితెర ప్రేక్షకులకి పరిచయం అవసరం లేని పేరు. జబర్దస్త్ మొదటి నుండి.. చంద్ర ఆ షోతోనే ఉంటూ వచ్చాడు. నిజానికి ఆ షో కారణంగానే చంద్ర మంచి పేరు దక్కించుకున్నాడు. తరువాత టీమ్ లీడర్ కూడా అయ్యాడు. తనకి మాత్రమే సొంతమైన ఫ్యామిలీ స్కిట్స్ చేస్తూ.. తనకంటూ సపరేట్ మార్క్ సెట్ చేసుకోవడంలో చమ్మక్ చంద్ర సూపర్ సక్సెస్ అయ్యాడనే చెప్పుకోవాలి. అయితే.., జబర్దస్త్ నుండి డైరెక్టర్స్, నాగబాబు బయటకి వెళ్ళిపోయినప్పుడు చంద్ర కూడా వారినే అనుసరించాడు. అలా పక్కకి వెళ్లి అదిరిందిలో ఫిక్స్ అయిపోయాడు.
జబర్దస్త్ కి పోటీగా మొదలైన అదిరింది కొన్ని ఎపిసోడ్స్ నడిచినా.., తరువాత ఆశించిన స్థాయి రేటింగ్స్ రాక ఆగిపోయింది. దీంతో.., చంద్ర ప్రస్తుతం ఆ టీవీ ఛానెల్ లోనే కొన్ని స్కిట్స్ వేసుకుంటూ ముందుకి వెళ్తున్నాడు. ఇక అదిరింది ఆగిపోయాక చంద్ర మళ్ళీ జబర్దస్త్ కి వస్తున్నాడన్న కామెంట్స్ వినిపించినా, అది కార్య రూపం దాల్చలేదు. అయితే.., తాజాగా సుమన్ టీవీకి ఇచ్చిన ఇంటర్వ్యూ లో చంద్ర ఈ రెండు షోల గురించి కొన్ని సంచలన విషయాలను బయటపెట్టాడు.
జబర్దస్త్ లో ఎక్కువ రెమ్యూనరేషన్ ఇస్తారా? అదిరిందిలో ఎక్కువ ఇస్తారా అన్న యాంకర్ ప్రశ్నకి చంద్ర సమాధానం చెప్పారు. జబర్దస్త్ లో కన్నా అదిరిందిలో 5 నుండి 10 ఎక్కువ ఇస్తారు. కానీ.., నేను జబర్దస్త్ నుండి బయటకి వచ్చేసింది డబ్బులు కోసం కాదు. జబర్దస్త్ డైరెక్టర్స్ కి సపోర్ట్ ఇవ్వడానికి మాత్రమే అని చంద్ర సమాధానం ఇచ్చాడు. ఇక మిగిలిన వాళ్ళు కూడా అదిరింది కి రావడానికి ప్రయత్నించి ఉండొచ్చని, కానీ.., జబర్దస్త్ నిర్వాహకులు ఆపి ఉండొచ్చని అభిప్రాయపడ్డాడు చంద్ర. ప్రస్తుతం చంద్ర చేసిన కామెంట్స్ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. మరి.., చమ్మక్ చంద్ర జబర్దస్త్ లోకి కమ్ బ్యాక్ ఇవ్వాలని మీరు కోరుకుంటున్నారా? మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియచేయండి.