తెలుగు చిత్ర పరిశ్రమలో బయోపిక్ ల కాలం నడుస్తోందనే చెప్పాలి. ఇటు తెలుగు సినిమా పరిశ్రమనే కాకుండా మిగతా సినిమా పరిశ్రమలన్నీ ప్రముఖుల బయోపిక్ లు తెరకెక్కిస్తూ ఉన్నారు. అయితే గతంలో రాజకీయ, క్రీడా, సినీ ప్రముఖుల జీవితాలను వెండితెరిపై చూపించారు. అలా రూపొందించి కొన్ని బయోపిక్ లు సక్సెస్ కాగా మరికొన్ని నిరాశపరిచాయి. అయితే తాజాగా ప్రముఖ రచయిత చలం (గుడిపాటి వెంకట చలం) జీవిత చరిత్రను వెండితెరపై ఆవిష్కరించేందుకు ప్రయత్నాలు జరుగుతున్నట్లు తెలుస్తోంది.
ఇది కూడా చదవండి: కుమార్తె డ్యాన్స్ చూసి మురిసిపోయిన మహేష్!
అన్నమయ్య, శ్రీరామదాసు లాంటి చిత్రాలకు కథ , మాటలు అందించిన ప్రముఖ రచయిత జేకే భారవి చలం బయోపిక్ తెరకెక్కించే సన్నాహాల్లో ఉన్నారని సమాచారం. ముందుగా చలం పాత్రకోసం భారవి కీరవాణిని సంప్రదించగా ఆయన సున్నితంగా తిరస్కరించారని టాక్. ఇప్పుడు మరో నటుడికోసం అన్వేషణ సాగుతోందట. అభ్యుదయ భావాలతో ఆయన సృష్టించిన స్త్రీ పాత్రలు సంచలనం సృష్టించాయి. ముఖ్యంగా మైదానం రచన ఎంత ప్రాముఖ్యత పొందిందో అందరికీ తెలుసు. ఇక తెలుగు సాహిత్య రంగంలో చీరస్మరణియుడిగా ఎదిగిన చలం జీవితాన్ని వెండితెరపై రావాలని మనం కూడా కోరుకుందాం. ఈ స్టోరీపై మీ అభిప్రాయాలను కామెంట్ రూపంలో తెలియజేయండి.
మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం SumanTV App డౌన్లోడ్ చేసుకోండి.