తనదైన కామెడీ పంచులతో కడుపుబ్బా నవ్వించే చలాకీ చంటి ప్రస్తుతం అనారోగ్యంతో ఆసుపత్రిలో చేరారు. అసలు ఏమైందంటే?
తెలుగులో లెక్క పెట్టలేనంత మంది కమెడియన్స్ ఉన్నారు. ‘జబర్దస్త్’ పుణ్యమా అని ఆ సంఖ్య మరింతగా పెరిగింది. దాదాపు పదేళ్ల క్రితం ఈ షో మొదలైనప్పటి నుంచి చాలామంది కొత్త హాస్యనటులు ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చారు. అలాంటి వాళ్లలో చలాకీ చంటి ఒకరు. ఓవైపు షోలో టీమ్ లీడర్ గా చేస్తూనే మరోవైపు పలు సినిమాల్లో కమెడియన్ పాత్రలు చేస్తూ వచ్చారు. తనదైన పంచులతో, కామెడీతో కడుపుబ్బా నవ్వించే చలాకీ చంటి.. గత కొన్ని రోజులుగా బుల్లితెర మీద గానీ, వెండి తెర మీద గానీ కనిపించింది లేదు. అయితే ఆయన తీవ్ర అస్వస్థతతో బాధపడుతున్నారు. కొన్ని అనారోగ్య సమస్యల కారణంగా ఆస్పత్రిలో చేరారు. తీవ్ర అస్వస్థతకు గురైన ఆయన ఐసీయూలో చికిత్స పొందుతున్నారు.
‘జబర్దస్త్’ ద్వారా గుర్తింపు తెచ్చుకున్న చంటి.. గతేడాది టెలికాస్ట్ అయిన బిగ్ బాస్ రియాలిటీ షో సీజన్ 6లో పాల్గొన్నారు. కానీ కొన్ని వారాల తర్వాత ఎలిమినేట్ అయిపోయారు. ఆ తర్వాత ఒకటి, రెండు షోస్ లో కనిపించడమే కానీ పూర్తిగా స్క్రీన్ కు దూరమైపోయారు. దీంతో చంటి ఎక్కడున్నారు? ఏమైపోయారు? అని ఫ్యాన్స్ కంగారు పడుతున్నారు. ఇలాంటి సమయంలో చంటి హాస్పిటల్ లో చేరారని తెలియడంతో ఫ్యాన్స్ ఆందోళన చెందుతున్నారు. దీని గురించి మరింత సమాచారం రావాల్సి ఉంది. ప్రస్తుతం అయితే ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నట్లు తెలుస్తోంది. అనారోగ్య సమస్య ఏంటన్నది తెలియాల్సి ఉంది. సీరియస్ మేటర్ అయితే కాకూడదు. చలాకీ చంటి త్వరగా కోలుకుని ఆసుపత్రి నుంచి ఇంటికి చేరుకోవాలని భగవంతుడ్ని కోరుకుందాం.