మన దేశంలో ప్రస్తుతం ఏ సీజన్ నడుస్తుంది అంటే చాలామంది చెప్పే వన్ అండ్ ఓన్లీ మాట పెళ్లిళ్ల సీజన్. నటీనటుల దగ్గర నుంచి క్రికెటర్ల వరకు వరసపెట్టి మ్యారేజ్ చేసుకుంటున్నారు. పెద్దల కుదిర్చిన, ప్రియుడి లేదా ప్రియురాలితో ఏడడుగులు వేసేస్తున్నారు. రీసెంట్ గా ఈ బంధంలోకి కేఎల్ రాహుల్, అక్షర్ పటేల్ లాంటి క్రికెటర్లతోపాటు పలువురు యాక్టర్స్ అడుగుపెట్టారు. ఇప్పుడు కూడా ఓ యువనటి.. తన ప్రియుడిని పెళ్లి చేసేసుకుంది. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన ఫొటోలు వైరల్ గా మారాయి.
ఇక వివరాల్లోకి వెళ్తే.. డెహ్రాడూన్ లో పుట్టిన చిత్రాశి రావత్ తొలుత మోడల్ గా కెరీర్ ప్రారంభించింది. కొన్ని యాడ్స్ లో కూడా నటించింది. బాలీవుడ్ బాద్ షా షారుక్ ఖాన్ హీరోగా చేసిన ‘చెక్ దే’ సినిమాలో కోమలి అనే హాకీ ప్లేయర్ గా చిత్రాశి నటించింది. ఈ సినిమాతో పేరు తెచ్చుకున్న ఈ భామ.. ఆ తర్వాత ఫ్యాషన్, లక్, తేరే నాల్ లవ్ హో గయా, బ్లాక్ హోమ్ లాంటి సినిమాలు చేసింది. ఇవి మాత్రమే కాదు బుల్లితెరపై కూడా పలు షోలు, సీరియల్స్ లో నటించి ఆకట్టుకుంది.
2021లో చివరగా ‘ఉర్ఫ్ గంటా’ మూవీలో యాక్ట్ చేసిన చిత్రాశి.. ‘ప్రేమ మాయి’ సినిమాలో తనతో పాటు కలిసి నటించిన ధ్రువ ఆదిత్యని తాజాగా పెళ్లి చేసుకుంది. గత కొన్నేళ్ల నుంచి రిలేషన్ లో వీళ్లిద్దరూ కూడా తాజాగా చత్తీస్ ఘడ్ లో ఏడడుగుల బంధంతో ఒక్కటయ్యారు. తాజాగా ఆ ఫొటోలో సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. ఇదిలా ఉండగా ధ్రువ కూడా ద గ్రే, ఫ్లైట్ సినిమాలతో పాటు ‘డ్యామేజ్డ్’ వెబ్ సిరీస్ లోనూ యాక్ట్ చేశాడు. వాయిస్ ఆర్టిస్ట్ గానూ పేరు తెచ్చుకున్నాడు. ఇక వీళ్లిద్దరూ కూడా చాలా సింపుల్ కుటుంబ సభ్యులు, సన్నిహితుల సమక్షంలో పెళ్లి చేసుకున్నారు. మరి నటి చిత్రాశి పెళ్లి ఫొటోలు చూసిన తర్వాత మీకేం అనిపించింది. కింద కామెంట్స్ లో మీ అభిప్రాయాన్ని చెప్పండి.