సినీ ఇండస్ట్రీలో ఈ మధ్య చర్చనీయాంశంగా మారిన మనీలాండరింగ్ ఇష్యూ ఏ స్థాయిలో షాకిచ్చిందో అందరికి తెలుసు. దాదాపు రూ. 200 కోట్ల మనీలాండరింగ్ కేసులో బాలీవుడ్ స్టార్ హీరోయిన్ల పేర్లు సైతం వినిపించాయి. ప్రస్తుతం ఈ మనీలాండరింగ్ కేసులో పలువురు బాలీవుడ్ హీరోయిన్స్ విచారణలో పాల్గొంటున్నారు. ఈ కేసులో ఆరోపణలు ఫేస్ చేసిన సుకేష్ చంద్రశేఖర్.. ఇప్పుడు తీహార్ జైల్లో ఉన్నాడు. అయితే.. ఈ కేసులో బాలీవుడ్ హీరోయిన్స్ జాక్వెలిన్ ఫెర్నాండేజ్ తో పాటు నోరా ఫతేహిలపై విచారణ జరుగుతోంది. ఇటీవల ఇచ్చిన వాంగ్మూలాలలో కూడా వీరిద్దరూ సుకేష్ పై షాకింగ్ విషయాలు తెలిపారు.
సుకేష్ తనని మోసగించాడని జాక్వెలిన్ ఆరోపించగా.. తనని బుట్టలో పడేసేందుకు సుకేష్ చాలా ట్రై చేశాడని నోరా ఫతేహి వ్యాఖ్యానించింది. ఓవైపు వీరి వాంగ్మూలాలపై విచారణ జరుగుతుండగా.. తాజాగా మరో బ్యూటీ జాక్వెలిన్, నోరా జట్టులో చేరింది. ప్రముఖ సీరియల్ నటి చాహత్ ఖన్నా.. సుకేష్ తనని జైలుకి పిలిచి మరీ.. పెళ్లి చేసుకుంటానని ప్రపోజ్ చేసినట్లు ఆమె ఆరోపించింది. అయితే.. ఆల్రెడీ చాహత్ ఖన్నాకి పెళ్లి జరిగి, ఇద్దరు పిల్లలు కూడా ఉన్నారు. మరి సుకేష్ తో పరిచయం, ప్రపోజల్ ఎలా జరిగాయి? అనే వివరాల్లోకి వెళ్తే.. సుకేష్ తనకు ప్రముఖ సౌత్ ఇండియన్ టీవీ ఛానల్ ఓనర్ గా, దివంగత తమిళనాడు సీఎం జయలలిత మేనల్లుడుగా మాయమాటలు చెప్పి పరిచయం చేసుకున్నట్లు చెప్పింది చాహత్.
అంతేగాక చాహత్ మాట్లాడుతూ.. “సుకేష్ నాకు పెద్ద ఫ్యాన్ అని.. నేను చేసిన ‘బడే అచ్చే లాగే హై’ సీరియల్ ని ఫాలో అవుతానని చెప్పి.. ఓ రోజు కలవాలని ఉందంటూ కబురు పంపాడు. అంత పెద్ద వ్యక్తి ఎందుకు పిలిచాడోనని కంగారు పడ్డాను. ఏమైనా ఈవెంట్ ఉందేమోనని.. 6 నెలల పాపని ఇంట్లో వదిలేసి అతని దగ్గరికి వెళ్లాను. అప్పుడు సుకేష్ జైలులో ఉన్నాడు. నేను వెళ్లిన వెంటనే మోకాళ్లపై కూర్చొని.. నన్ను పెళ్లి చేసుకుంటానని అన్నాడు. నేను షాకైపోయా. వెంటనే నాకు పెళ్లైంది, ఇద్దరు పిల్లలు ఉన్నారని గట్టిగా చెప్పాను. అంతటితో ఆగకుండా.. నీ భర్త నీకు సరైనవాడు కాదని కామెంట్ చేశాడు. నాకు ఏడుపు వచ్చేసింది.” అని చెప్పుకొచ్చింది. ప్రస్తుతం సుకేష్ పై చాహత్ చేసిన వ్యాఖ్యలు ఇండస్ట్రీలో హాట్ టాపిక్ గా మారాయి. సుకేష్ ని జైల్లో కలిసినందుకు చాహత్ కి కూడా కోర్టు నుండి సమన్లు అందడం గమనార్హం.
Chahatt disclosed, Sukesh proposed me and would call me from jail and ask about my kids; wanted to know if I needed anything.
.
.
.
#chahattkhanna #SukeshChandrashekhar #Bollywood #Saturday pic.twitter.com/wxctx5V5O5— Photofit Buzz (@PhotofitM) January 28, 2023