ఈటీవీ లో ప్రసారమయ్యే క్యాష్ కార్యక్రమం ప్రస్తుతం ఎంటర్టైన్మెంట్ కు కేరాఫ్ అడ్రస్ గా మారిపోయింది అని చెప్పడంలో ఎలాంటి సందేహం లేదు. తెలుగులో టాప్ యాంకర్ గా కొనసాగుతున్న సుమ.. ఈ షోని ఒంటిచేత్తో అలవోకగా నడిపిస్తుంటారు. క్యాష్ షో కోసం ప్రతివారం నలుగురు సినీ సెలబ్రిటీల ను స్పెషల్ గెస్ట్ గా ఆహ్వానించడం.. ఇక ఆ తర్వాత వారిని ఆసక్తికర ప్రశ్నలు అడగడం స్పాంటేనియస్ పంచులతో నవ్వులు పూయించటం చేస్తూ ఉంటుంది సుమ. అంతేకాకుండా వారితో ఫన్నీ టాస్క్ లు ఆడిస్తూ ఉంటుంది. ఈ క్రమంలో క్యాష్ ఇటీవలే పెద్ద ప్రమాదం జరిగింది. దీంతో ఒక్కసారిగా అందరూ షాక్ అయ్యారు. క్యాష్ కార్యక్రమంలో కి గెస్ట్ గా వచ్చిన జబర్దస్త్ నరేష్ ప్రమాదానికి గురయ్యాడు.
ఇంతకీ ఏం జరిగిందంటే.. ఈ షోకి సంబంధించిన ప్రోమో ఇటీవల విడుదలైంది. ఈ ప్రోమోలో భాగంగా నాలుగు జంటలు ఎంట్రీ ఇచ్చాయి. ఇకపోతే టాస్క్ లో భాగంగా జంటగా వచ్చిన వారితో ఒక్కరికొక్కరిని ప్రపోజ్ చేస్తారు. కానీ అటు జబర్దస్త్ నరేష్ మాత్రం యాంకర్ సుమకి ప్రపోజ్ చేశాడు. సుమ మాత్రం ఒప్పుకోలేదు. కానీ ప్రోమో చివర్లో మీరు ఒప్పుకోకపోతే కిందకు దూకేస్తానంటూ నరేష్ స్టేజీ చివరికి వెళ్తాడు. అయినా సుమ పట్టించుకోదు. చివరికి కాలు జారి కింద పడిపోతాడు. దీంతో ఒక్కసారిగా అందరూ షాక్ అయ్యారు. తర్వాత అంబులెన్స్ సౌండ్ కూడా వినిపిస్తుంది. ఏం జరిగిందన్నది మాత్రం ఫుల్ ఎపిసోడ్ లో చూడాల్సిందే. ఈ వీడియో పై మీరు ఓ లుక్కేయండి. మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.