ప్రస్తుతం బుల్లితెరపై ఒక సెన్సేషనల్ కామెడీ షో జబర్దస్త్ రసవత్తరంగా సాగుతోంది. లేడీ కంటెస్టెంట్ అసలు ఉండేవారు కాదు. లేడీ గెటప్ లను కూడా మగవారే వేసుకుని జబర్దస్త్ కామెడీ పండించే వారు. కానీ, ఇటీవలి కాలంలో జబర్దస్త్ కార్యక్రమం లో ఎంతోమంది లేడీ కంటెస్టెంట్ కూడా ఎంట్రీ ఇస్తు ఇక తమదైన శైలిలో కామెడీ పంచుతూ బాగా ఫేమస్ అయిపోతున్నారు. ఈ మధ్య కాలంలో జబర్దస్త్ లో ఎంట్రీ ఇచ్చి బాగా పాపులారిటీ సంపాదించిన లేడీ కంటెస్టెంట్స్ ఎవరు అంటే రోహిణీ, వర్ష అని చెప్పడంలో అతిశయోక్తి లేదు. కొంతమంది జబర్దస్త్ నటీమణులతో పాటు కొంతమంది సీరియల్ నటి మణులను కూడా క్యాష్ ప్రోగాం కి గెస్ట్ లుగా పిలిచింది యాంకర్ సుమ. ఇక తనదైన శైలిలోనే డాన్సులు చేస్తూ ఎంతో ఎంటర్టైన్మెంట్ పంచింది. ఇక ఎప్పటి లాగానే ఇటీ వలే విడుదలైన క్యాష్ ప్రోమో సందడి సందడి గా మారిపోయింది అని చెప్పాలి. కానీ ఈ ప్రోమో చివరిలో సడన్ గా సుమక్కకి కోపం వచ్చేసింది.
సాధారణంగా జబర్దస్త్ కమెడియన్స్ ఒకరి పై ఒకరు ఎప్పుడు పంచులు వేసుకోవడం లాంటివి చేస్తూ ఉంటారు అన్న విషయం తెలిసిందే. ఒకరిపై ఒకరు పంచులు వేసుకోవడమే రోహిణీ, వర్ష మధ్య పెద్ద గొడవకు కారణం అయింది. జబర్దస్త్ లో ఎంతో ఫేమస్ అయిన వర్ష రోహిణీ సుమ వ్యాఖ్యాతగా వ్యవహరిస్తున్న క్యాష్ షో కి స్పెషల్ గెస్ట్ లుగా వచ్చారు. ఈ ప్రోమోలో భాగంగా వీరిద్దరూ దారుణంగా గొడవ పడటం ఒకరిపై ఒకరు పర్సనల్ కామెంట్ చేసుకోవడం హాట్ టాపిక్ గా మారిపోయింది. ఒక టాస్క్ ప్రారంభంలో భాగంగా బండా అంటూ రోహిణిని పిలుస్తుంది వర్ష. నువ్వు ఇంకోసారి అలా పిలిచావ్ అనుకో నాకు అస్సలు నచ్చదు అని వార్నింగ్ ఇస్తుంది రోహిణీ. నీ ముందు నిలబడటం కూడా నాకు నచ్చదు అంటూ రోహిణీ షాకింగ్ కామెంట్స్ చేసింది. ఇక నుంచి నువ్వు ఉన్న ఏ షో కి కూడా నేను రాను అని చెప్పింది.
నువ్వు సన్నగా ఉండొచ్చు నా ఒళ్ళు ఇంతే ఇలాగే ఉంటాను కానీ, అలా పిలిచావ్ అనుకో అస్సలు బాగోదు అంటూ వార్నింగ్ ఇచ్చింది రోహిణీ . దీంతో ఇక వర్ష ఏడ్చుకుంటూ వెళ్ళిపోతుంది. అంతలోనే కోపం తో యాంకర్ సుమ కూడా స్టేజ్ దిగి వెళ్ళిపోయింది. విడుదలైన ప్రోమో లో వర్ష – రోహిణి మధ్య గొడవ జరిగింది. ఇక ఒకరిని ఒకరు దూషించడం లాంటివి కూడా చేసినట్లు చూపించారు. ఏకంగా పర్సనల్ కామెంట్స్ కూడా చేసుకున్నారు. దీంతో సుమఒక్కసారిగా అవాక్కయ్యింది. ఇక వారు ఒకరి పై ఒకరు కామెంట్లు చేసుకోవడం చూసి ఒకరిపై ఒకరు కనీసం మినిమం రెస్పెక్ట్ లేకుండా మాట్లాడతారా అంటూ కోపంతో తన చేతిలో పట్టుకున్న కార్డు నేలకేసి కొట్టి ఇక్కడ నుంచి వెళ్ళి పోయింది సుమ. ఇక ఈ ప్రోమో చూసిన బుల్లితెర ప్రేక్షకులు అందరూ షాక్ అవుతున్నారు అని చెప్పాలి. అయితే ఇది కూడా ప్రోమో రక్తి కట్టించే విధంగా షూట్ చేసారని మరికొందరి వ్యాఖ్యానం. చూడాలి మరి ఈ శనివారం రాత్రి వరకూ వెయిట్ చేయాల్సిందే.