తెలుగు సినిమా ట్రెండ్ మారింది. ఒకప్పుడు చిత్రాన్ని ప్రేక్షకుల్లోకి తీసుకెళ్లేందుకు.. ప్రీ రిలీజ్, ఆడియో ఫంక్షన్ అని పెద్ద పెద్ద ఈవెంట్స్ నిర్వహించి అంచనాలు పెంచేవారు. టెక్నాలజీ పెరిగిన తర్వాత రూటు మార్చారు. సోషల్ మీడియాలో ప్రమోట్ చేసుకోవడంతో పాటు, టీవీ చూసే ప్రేక్షకుల్ని ఆకర్షించేందుకు నేరుగా మూవీ టీమ్స్, టీవీ షోల్లోనే పాల్గొంటున్నాయి. చిన్నా పెద్దా అనే తేడా లేకుండా స్టార్ హీరోలు-డైరెక్టర్స్ కూడా తమ సినిమాల్ని, టీవీ షోల్లో పాల్గొని ప్రమోట్ చేసుకుంటున్నారు. ఈ క్రమంలోనే క్యాష్ తాజా ప్రోమోకి రాజమౌళి రావడం ఇండస్ట్రీలో హట్ టాపిక్ అయింది.
ఇక వివరాల్లోకి వెళ్తే.. బాహుబలి, త్రిబుల్ ఆర్ లాంటి మూవీస్ తీసి, వండర్స్ క్రియేట్ చేసిన దర్శకుడు రాజమౌళి. ఆయన ఏ సినిమా విషయంలోనైనా సరే 100 శాతం ఎఫర్ట్ పెడతారు. సినిమా తీసి వదిలేయకుండా దాన్ని ప్రేక్షకుల్లోకి తీసుకెళ్లడానికి శాయశక్తులా కృషి చేస్తారు. ఈ క్రమంలోనే తన సమర్పణలో వస్తున్న ‘బ్రహ్మాస్త్రం’ సినిమా కోసం ఫస్ట్ టైమ్ క్యాష్ షోలో సందడి చేశారు. దీంతో ఉబ్బితబ్బిబయిన యాంకర్ సుమ.. ఓసారి గిచ్చమని అడిగింది. రాజమౌళి గిచ్చడంతో హమ్మయ్యా ఇది నిజమేనని అనుకుంది. రాజమౌళితో పాటే ‘బ్రహ్మాస్తం’ సినిమా హీరోహీరోయిన్స్ రణ్ బీర్-ఆలియా, విలన్ మౌనీరాయ్ కూడా షోలో సందడి చేశారు. ముద్దుముద్దుగా తెలుగు మాట్లాడుతూ తెలుగు ప్రేక్షకులకు దగ్గరయ్యే ప్రయత్నం చేస్తున్నారు.
ప్రస్తుతం ప్రెగ్నెన్సీతో ఉన్న ఆలియాభట్ కి యాంకర్ సుమ.. చీరసారె పెట్టి తెలుగు సంప్రదాయం ఎంత గొప్పదో చాటిచెప్పింది. అలానే బాలీవుడ్ లో ఎన్ని గొడవలున్నా సరే వాళ్లంటే తమకు ఏ మాత్రం అయిష్టత లేదని కూడా తెలుగు వాళ్లు నిరూపించారు. ఇక ఇదే షోలో రాజమౌళి ఇప్పటివరకు తీసిన కొన్ని సినిమాల్లో హీరోలు ఉపయోగించిన ఆయుధాల్ని షోలో ప్రదర్శించారు. వాటితో సుమ-రాజమౌళి చేసిన సందడి వేరే లెవల్లో ఉంది. దీని తర్వాత త్రిబుల్ ఆర్ మూవీ గురించి రాజమౌళికి షాకింగ్ ప్రశ్న వేసిన సుమ.. ఆయన్ని అడ్డంగా ఇరికించేసింది.
ఎందుకంటే ఈ చిత్రం వచ్చినప్పుడు ప్రతి ఒక్కరూ కూడా సినిమా బాగుందని అనుకున్నారు. దానితోపాటే మా హీరో బాగా చేశాడంటే మా హీరో బాగా చేశాడని అనుకున్నారు. అప్పట్లో సోషల్ మీడియాలో ఈ విషయం గురించి చాలానే చర్చ నడిచింది. ఫైనల్ గా ఇదే విషయమై ఏకంగా రాజమౌళినే సుమ ప్రశ్న అడిగింది. త్రిబుల్ ఆర్ సినిమాలో ఏ హీరో బాగా చేశాడు అని అడిగింది. రాజమౌళి చెప్పిన ఆన్సర్ మాత్రం ప్రోమోలో చూపించలేదు. మరి ఆయన సమాధానం తెలియాలంటే.. శనివారం ఫుల్ ఎపిసోడ్ ప్రసారమయ్యేంత వరకు ఆగాల్సిందే. ఈ విషయమై మీ అభిప్రాయాన్ని కామెంట్స్ లో పోస్ట్ చేయండి.
ఇదీ చదవండి: బ్రహ్మాస్త్రం మూవీకి సపోర్ట్ గా రాజమౌళి! నెటిజన్స్ ట్రోల్స్ మాములుగా లేవు