అల్లుడు శ్రీను సినిమాతో టాలీవుడ్ లోకి ఎంట్రీ ఇచ్చి.. ప్రస్తుతం బాలీవుడ్ అదృష్టం పరిక్షించుకోనున్న టాలీవుడ్ యంగ్ హీరో బెల్లంకొండ శ్రీనివాస్, అతని తండ్రి నిర్మాత బెల్లంకొండ సురేష్ పై కేసు నమోదైంది. వీఎల్ శ్రవణ్ కుమార్ అనే ఫైనాన్షియర్ ఫిర్యాదుతో కేసు నమోదు చేసినట్లు తెలుస్తోంది. హైదరాబాద్ బంజారాహిల్స్ పోలీస్ స్టేషన్ లో కేసు నమోదు అయ్యింది.
ఫైనాన్షియర్ ఫిర్యాదు ప్రకారం.. 2018-2019 మధ్యలో ఓ సినిమా ప్రొడక్షన్ కోసం బెల్లంకొండ సురేష్, శ్రీనివాస్ అతని వద్ద రూ.85 లక్షలు అప్పుగా తీసుకున్నారు. చాలా మంది టెక్నిషియన్స్ కి శ్రవణ్ కుమార్ అకౌంట్ నుంచే డబ్బు పంపినట్లు తెలిపారు. తర్వాత తన డబ్బు తిరిగి ఇవ్వమని అడిగితే సురేష్, శ్రీనివాస్ ఇద్దరూ పట్టించుకోలేదని ఆరోపించాడు. తనపై బెదిరింపులకు దిగినట్లు ఫిర్యాదులో వెల్లడించాడు. సినిమాలో పార్టనర్ గా చేస్తామని చెప్పి.. మోసం చేశారంటూ పోలీసులను ఆశ్రయించారు. కేసు నమోదు చేసి పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. బెల్లంకొండ సురేష్, శ్రీనివాస్ ఈ కేసుపై ఎలా స్పందిస్తారో చూడాలి. ఈ ఘటనపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.