నాచురల్ స్టార్ నాని, ఎక్స్‌ప్రెషన్స్ క్వీన్ నజ్రియా నజీమ్ జంటగా వివేక్ ఆత్రేయ దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం “అంటే.. సుందరానికీ”. నవీన్ యోర్నేని, రవిశంకర్ నిర్మాతలుగా మైత్రీ మూవీస్, శ్రేయాస్ మీడియా సంస్థలు ఈ చిత్రాన్ని నిర్మించాయి. ఈ సినిమా జూన్ 10న ప్రేక్షకుల ముందుకు వచ్చి హిట్ టాక్ సొంతం చేసుకోవడంతో పాటు.. విమర్శకులనుంచి కూడా మంచి రివ్యూలను సొంతం చేసుకుంది. మంచి కలెక్షన్స్ తో ఈ మూవీ దూసుకెళ్తుంది. ఈ విజయంతో “అంటే సుందరానికీ” ఫుల్ జోష్ లో ఉంది. అయితే తాజాగా “అంటే సుందరానికీ!” మూవీ నిర్మాణ సంస్థలపై కేసు నమోదైంది.
“అంటే సుందరానికీ” మూవీ ప్రీరిలీజ్ ఈవెంట్‌ని ఈ గురువారం మాదాపూర్ శిల్పకళా వేదికలో ఘనంగా జరిగింది. ఈ ఈవెంట్‌కి పవన్ కల్యాణ్ ముఖ్య అతిథిగా వెళ్లారు. అయితే అనుమతి తీసుకోకుండానే “అంటే సుందరానికీ” మూవీ ప్రీరిలీజ్ ఈవెంట్ నిర్వహించారంటూ ప్రముఖ నిర్మాణ సంస్థ మైత్రీ మూవీస్, శ్రేయాస్ మీడియాపై మాదాపూర్ పోలీసులు కేసు నమోదు చేశారు. ప్రీరిలీజ్ ఈవెంట్‌కి పవన్ కల్యాణ్ లాంటి స్టార్ హీరో వస్తున్నప్పటీకీ..సమాచారం ఇవ్వకుండా శ్రేయాస్ మీడియా ఈ ఈవెంట్‌ని నిర్వహించిందని పోలీసులు తెలిపారు. దీంతో నిబంధనలు ఉల్లఘించారంటూ శ్రీయాస్ మీడియా ఈవెంట్ మేనేజర్ సురేశ్‌తో పాటు మైత్రీ మూవీస్‌పై సెక్షన్ 188 కింద కేసు నమోదు చేశారు. మరి.. ఈవిషయంపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.
ఇదీ చదవండి: తిరుమలలో అలా చేయాల్సింది కాదు. క్షమించండి! విఘ్నేశ్ శివన్ లేఖ వైరల్