ప్రముఖ సంగీత దర్శకుడు రాజ్ ఆదివారం కన్నుమూశారు. వెంటనే ప్రముఖ నటుడు శరత్ బాబు ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మరణించారు. అలాగే యువ నటీ నటులు ఆదిత్య సింగ్ రాజ్ పుత్, వీ నటి వైభవి ఉపాధ్యాయ మరణ వార్తలు విన్నాం. తాజాగా ప్రముఖ నటి కన్నుమూసింది.
సినీ పరిశ్రమను వరుసగా విషాదాలు వెంటాడుతున్నాయి. ఒక్కొక్కరుగా ఈ లోకాన్ని విడిచి వెళ్లిపోతున్నారు. ప్రముఖ సంగీత దర్శకుడు రాజ్ ఆదివారం కన్నుమూశారు. వెంటనే ప్రముఖ నటుడు శరత్ బాబు ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మరణించారు. అలాగే యువ నటీ నటులు ఆదిత్య సింగ్ రాజ్ పుత్ తన అపార్ట్ మెంట్‌లో విగతజీవిగా కనిపించాడు. టీవీ నటి వైభవి ఉపాధ్యాయ ప్రమాదంలో మరణించిన సంగతి విదితమే. అంతేకాకుండా బాలీవుడ్ మరో నటుడు నితేష్ పాండే (51) హఠాన్మరణం చెందారు. గుండెపోటుతో ఆయన మరణించారు. ఈ వార్తలన్నీ మరచిపోకముందే మరో ప్రముఖ నటి చిన్న వయస్సులోనే ఈ లోకాన్ని విడిచి పెట్టి వెళ్లిపోయారు. కొన్ని రోజుల నుండి అనారోగ్యంతో బాధపడుతున్న ఆమె చికిత్స పొందుతూ కన్నుమూసింది.
కెనడా నటి, మ్యూజిషియన్ సమంత వైన్ స్టెయిన్ ఇక లేరు. 28 ఏళ్ల వయస్సులో తుది శ్వాస విడిచారు. తొమ్మిదేళ్ల వయస్సు నుండి నటించడం ప్రారంభించిన ఆమె.. రెండున్నరేళ్లుగా అండాశయ క్యాన్సర్‌తో పోరాడుతున్నారు. ఈ నెల 14వ తేదీన టొరంటో ప్రిన్సెస్ మార్గరెట్ హాస్పిటల్‌లో మరణించగా.. ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. ఆమె మరణ వార్తను తండ్రి ధ్రువీకరించారు. నటి మరణంపై హాలీవుడ్ సెలబ్రిటీలు దిగ్భ్రాంతి వ్యక్తం చేస్తున్నారు. ఆమె మరణ వార్తను తల్లిదండ్రులు జీర్ణించుకోలేకపోతున్నారు. . ‘తను ఎప్పుడూ పాజిటివ్‌గా ఉంటుంది. తనతో కాసేపు కలిసి మాట్లాడితే చాటు ఆ పాజిటివ్ వైబ్స్ వస్తాయని చాలామంది చెప్తూ ఉంటారు’ అంటూ కూతుర్ని తలుచుకుని కన్నీటిపర్యంతమయ్యాడు. సమంత మా అందరి జీవితాలను మార్చివేసిందంటూ ఆమె తల్లి భావోద్వేగానికి లోనైంది.
2005లో బిగ్ గర్ల్‌లో జోసెఫిన్ పాత్రను పోషించింది. ఈ సినిమాలో అత్యుత్తమ నటనకు గాను 2006లో ఏసీటిఆర్ఏ(ACTRA) అవార్డును గెలుచుకుంది, ఆ ప్రశంసలను గెలుచుకున్న అతి పిన్న వయస్కురాలిగా ఆమె నిలిచింది.2013లో వచ్చిన క్యారీ రీమేక్ లో కూడా స్కూల్ విద్యార్థినిగా నటించింది.డిఎన్ ఏస్, డినో రాంచ్ మరియు విష్‌ఫార్ట్ వంటి యానిమేషన్ సిరీస్‌లలోకూడా నటించింది. సమంత గిటార్ వాయించడం, పాటలు పాడుతూ ఎంజాయ్ చేయడమంటే ఇష్టం. పలు చిత్రాల్లో నటించి మెప్పించిన సమంత 2022 అక్టోబర్‌లో మైఖేల్ నుట్సన్‌ను పెళ్లాడింది. మే 1న అతడితో కలిసి హనీమూన్‌కు వెళ్లిన ఫోటోలు ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేసింది. ఇందులో నటి తన భర్తతో కలిసి చిరునవ్వులు చిందించింది. అయితే అదే ఆమె ఆఖరి పోస్టు కావడం గమనార్హం.