సినీ ఇండస్ట్రీలో చైల్డ్ ఆర్టిస్ట్ లుగా సినిమాలు చేయకపోయినా కొంతమంది సినీతారలు డైరెక్ట్ ఎంట్రీతో మంచి గుర్తింపు దక్కించుకుంటారు. ఆల్రెడీ ఫిల్మీ బ్యాక్ గ్రౌండ్ ఉన్న ఫ్యామిలీ నుండి వచ్చినప్పటికీ, సొంత టాలెంట్ అనేది ఖచ్చితంగా ప్రూవ్ చేసుకోవాల్సి ఉంటుంది. అలా సినీ బ్యాక్ గ్రౌండ్ కలిగినా.. తమకంటూ సొంత క్రేజ్ ని క్రియేట్ చేసుకున్నవారు టాలీవుడ్ లో చాలామంది ఉన్నారు. అయితే.. అవకాశాల సంగతేంటని అనిపించవచ్చు. ఫ్యామిలీ పేరు చెప్పుకోకుండా నటులుగా సక్సెస్ అయినవారికి అవకాశాలు వెతుక్కుంటూ వచ్చేస్తుంటాయి. ఆ విషయాన్నీ ప్రూవ్ చేసిన టాలీవుడ్ బ్యూటీలలో మంచు లక్ష్మి ఒకరు.
అవును.. మంచు లక్ష్మి ఇండస్ట్రీలో బాలనటిగా ఎలాంటి సినిమాలు చేయలేదు. కలెక్షన్ కింగ్ మోహన్ బాబు తనయగా సినిమాల్లోకి వచ్చినా.. అతికొద్ది టైంలోనే మంచి గుర్తింపు తెచ్చుకుంది. అయితే.. టాలీవుడ్ ఎంట్రీకి ముందే లక్ష్మి.. రెండు ఇంగ్లీష్ సినిమాలలో చిన్న రోల్స్ చేసింది. ఆ తర్వాత 2011లో సిద్ధార్థ్ హీరోగా నటించిన ‘అనగనగా ఓ ధీరుడు’ మూవీతో విలన్ గా డెబ్యూ చేసింది. అంతే.. అక్కడినుండి నటిగా వెనక్కి తిరిగి చూసుకోలేదనే చెప్పాలి. విలన్ గానే కాకుండా హీరోయిన్ గా, క్యారెక్టర్ ఆర్టిస్టుగా చాలా సినిమాలే చేసింది. చిన్న పెద్ద సినిమాలు అని చూడకుండా వరుస ప్రాజెక్ట్ లతో దూసుకుపోతుంది.
ఇదిలా ఉండగా.. మంచు లక్ష్మి కేవలం తెలుగులోనే కాకుండా తమిళ, హిందీ, మలయాళం సినిమాలలో కూడా నటించడం విశేషం. కాగా.. నటిగానే కాకుండా లక్ష్మి ఓవైపు ప్రొడ్యూసర్ గా, మరోవైపు టీవీ ప్రెజెంటర్ గా కూడా ప్రేక్షకులను ఎంటర్టైన్ చేస్తోంది. అయితే.. సోషల్ మీడియాలో ఎప్పుడు యాక్టీవ్ గా ఉండే లక్ష్మి.. ఎప్పటికప్పుడు తన తదుపరి సినిమాలు, పర్సనల్ లైఫ్ విషయాలతో పాటు గ్లామరస్ ఫోటోషూట్స్ సైతం పోస్ట్ చేస్తుంటుంది. ఈ క్రమంలో లక్ష్మికి సంబంధించి చిన్ననాటి ఫోటో ఒకటి సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. పిక్ చూస్తే.. చేతిలో పామును పట్టుకొని కెమెరాకు ఫోజిచ్చింది. ఎంతో క్యూట్ గా ఉన్న లక్ష్మి చైల్డ్ పిక్ పై మీ అభిప్రాయాలు కామెంట్స్ లో తెలియజేయండి.
#ManchuLakshmi Childhood pic pic.twitter.com/wChveUlIpU
— Hardin (@hardintessa143) December 31, 2022