సెలబ్రిటీలకు సంబంధించి ఏ చిన్న విషయమైనా తెలుసుకోవాలనే ఉత్సాహం అందరి ఫ్యాన్స్ లోను ఉంటుంది. ఇప్పుడు ఏ విషయమైనా క్షణాలలో షేర్ చేసుకునేందుకు సోషల్ మీడియా ప్లాట్ ఫామ్ అందుబాటులోకి వచ్చేసింది. ఇదివరకంటే సెలబ్రిటీలకు సంబంధించి ఏ వార్తలైనా పేపర్ లో లేకపోతే టీవీ న్యూస్ లో చూసి తెలుసుకునేవారు. కొన్నాళ్లుగా ఆ అవసరం లేకుండా పోయింది. ఎందుకంటే.. స్వయంగా సెలబ్రిటీలే అన్ని విషయాలను, విషెష్ లను రెగ్యులర్ గా షేర్ చేసుకుంటున్నారు. ముఖ్యంగా పెళ్లి, ఎంగేజ్మెంట్, పుట్టినరోజులు, ఫ్యామిలీ ఫంక్షన్స్, టూర్స్ అన్నీ సోషల్ మీడియాలోనే పెట్టేస్తున్నారు.
ఇక సెలబ్రిటీల కెరీర్ విషయాలతో పాటు వ్యక్తిగత జీవితం గురించి కూడా తెలుసుకోవాలని చూస్తుంటారు. కానీ.. అందరు సెలబ్రిటీలు అన్నింటికి సిద్ధంగా ఉండరు. ముఖ్యంగా హీరోయిన్స్, టీవీ యాంకర్స్ అయితే పర్సనల్ విషయాలు దాదాపు సోషల్ మీడియాకి దూరంగా ఉంచడానికి ప్రాధాన్యత ఇస్తుంటారు. అయినా సరే ఎలాగోలా అభిమాన సెలబ్రిటీకి సంబంధించి వివరాలను రాబడుతుంటారు ఫ్యాన్స్. ఇదిలా ఉండగా.. తాజాగా టాలీవుడ్ లో గ్లామరస్ బ్యూటీగా పేరొందిన ఓ యాంకర్ కి సంబంధించి చిన్ననాటి ఫోటో ఒకటి సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. ఎంతో ముద్దుగా రెడ్ డ్రెస్ లో క్యాప్ పెట్టుకొని కూర్చున్న ఆ పిక్ చూసి నెటిజన్స్ ఎవరబ్బా అని ఆరా తీస్తున్నారు.
ఇంతకీ ఈ చిన్నప్పటి పిక్ లో ఉన్న గ్లామర్ బ్యూటీ ఎవరో గుర్తొచ్చిందా? ఆ పాపే యాంకర్ వర్షిణి. అవును.. తెలుగు బుల్లితెరపై ఎన్నో పాపులర్ టీవీ షోలతో మంచి క్రేజ్ సంపాదించుకున్న వర్షిణి.. ఢీలో ఆదికి, పటాస్ 2లో యాంకర్ రవికి జోడిగా కనిపించి సందడి చేసింది. హైదరాబాద్ లో పుట్టిపెరిగిన వర్షిణి.. మోడలింగ్ ద్వారా యాంకరింగ్, యాక్టింగ్ లో అడుగు పెట్టింది. పలు సినిమాలలో సైడ్ క్యారెక్టర్స్ పోషించిన ఈ భామ.. పెళ్లి గోల అనే వెబ్ సిరీస్ లో లీడ్ రోల్ ప్లే చేసింది. ఇప్పటికీ హీరోయిన్ గా ఇండస్ట్రీలో నిలదొక్కుకునే ప్రయత్నాలు చేస్తోంది. ప్రస్తుతం ‘శాకుంతలం’ సినిమాలో కూడా నటిస్తోంది. మరి వైరల్ అవుతున్న యాంకర్ వర్షిణి చైల్డ్ హుడ్ పిక్ పై మీ అభిప్రాయాలు కామెంట్స్ లో తెలియజేయండి.