సినిమా ఇండస్ట్రీకి చాలా మంది వస్తుంటారు వెళ్తుంటారు. వారిలో కొందరే స్టార్ లుగా రాణిస్తారు. మరికొంత మంది అవకాశాలు రాక నటనకు దూరమవుతారు. పై ఫొటోలో కనిపిస్తున్న హీరోయిన్ కూడా తెలుగులో పలు సినిమాల్లో నటించి మెప్పించింది. ఆమె ఎవరో గుర్తు పట్టారా.
సినీ పరిశ్రమ ఓ రంగుల ప్రపంచం. సినిమాల్లో నటించాలని కోరుకునే ప్రతి ఒక్కరికి అవకాశాలు లభించవు. ఒక వేళ అవకాశాలు లభించినా అంతగా రాణించలేక తెర నుంచి కనుమరుగవుతారు. సినీరంగంలో అడుగుపెట్టే ప్రతిఒక్కరు తమ ప్రతిభను చాటి నిలదొక్కుకోవాలని స్టార్ హీరోయిన్ గా ఎదగాలని శ్రమిస్తుంటారు. కానీ కొన్ని సార్లు కెరీర్ లో ఎదురుగాలి వీస్తుంది. వారు నటించిన సినిమాలు హిట్ అవ్వక అవకాశాలు కోల్పోయే ప్రమాదం నెలకొంటుంది. ఈ ఫొటోలో కనిపిస్తున్న హీరోయిన్ కూడా తెలుగు సినీ ఇండస్ట్రీలో ప్రముఖ డైరెక్టర్ సినిమా ద్వారా పరిచయమైంది. ఆ తరువాత కొద్ది పాటి సినిమాలు చేసింది. ఆ తర్వాత సరైన అవకాశాలు రాక సినిమాలకు దూరమైంది. కానీ చేసింది తక్కువ సినిమాలే అయినప్పటికి తను చేసే కాంట్రవర్సీ వ్యాఖ్యలతో ఎక్కువగా పాపులర్ అయ్యింది ఈ ముద్దుగుమ్మ. సినీ, రాజకీయ ప్రముఖులపై హాట్ కామెంట్స్ చేస్తూ కాంట్రవర్సీకి కేరాఫ్ అడ్రస్ గా మారింది. ఇప్పుడైనా ఈ హీరోయిన్ ఎవరో గుర్తొచ్చిందా. ఆమె మరెవరో కాదు నటి పూనమ్ కౌర్. ఆమె ఒకానొక సందర్భంలో వైఎస్ ఆర్ ను కలిసిన వేళ నవ్వులు చిందిస్తూ ఫొటోలకు పోజులిచ్చింది.
టాలీవుడ్ నటి పూనమ్ కౌర్ గురించి పరిచయం చేయాల్సిన అవసరం లేదు. తెలుగులో మాయాజాలం సినిమాతో వెండితెరకు ఎంట్రీ ఇచ్చింది ఈ బామ. ఆ తరువాత తమిళ్, కన్నడ చిత్రాల్లో అవకాశాలు రావడంతో పలు సినిమాలు చేసింది. అయితే నటి పూనమ్ కౌర్ ఇండస్ట్రీకి సంబంధించి ఏదైన సంఘటన జరిగితే వెంటనే స్పందిస్తుంది. ప్రముఖులను టార్గెట్ చేస్తూ పరోక్షంగా వివాదాస్పద వ్యాఖ్యలు చేస్తూ ఉంటుంది. చేసింది తక్కువ సినిమాలే అయినా కాంట్రవర్సీ కామెంట్స్ తోనే ఎక్కువగా గుర్తింపు పొందింది. సోషల్ మీడియాలో ఆక్టీవ్ గా ఉండే పూనమ్ తరచు ఏదో ఒక పోస్ట్ పెడుతూ ఫ్యాన్స్ కు దగ్గరవుతూ ఉంటుంది. ఆ మధ్య ఓ కార్యక్రమంలో పాల్గొన్న ఆమె సినిమాల్లో అవకాశాలు ఇవ్వకుండా ఇండస్ట్రీ నుంచి వెలేస్తున్నారని భావోద్వేగానికి గురైన విషయం తెలిసిందే. ఇటీవల గురుపౌర్ణమి సందర్భంగా తన ఇన్ స్టా స్టోరీలో స్టేజీల మీద నీతులు చెప్పి జీవితాలతో ఆడుకునే వారు గురువు కాదు. మీకు మంచి మార్గం చూపించే వారే గురువవుతారని రాసుకొచ్చింది. దీంతో ఆ స్టోరీ క్షణాల్లో వైరల్ గా మారింది. కాగా వైఎస్ఆర్ జన్మదినం సందర్భంగా ఆయనతో కలిసి దిగిన ఫొటోను సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది. దీనిపై నెటిజన్స్ స్పందిస్తూ కామెంట్ చేస్తున్నారు. దీంతో ఈ ఫొటో వైరల్ గా మారింది.