యూట్యూబర్ శ్రీకాంత్ రెడ్డి తన ప్రాంక్ వీడియోలతో యూట్యూబ్‌లో ఎంత మందికి చేరువయ్యాడో.. లేదో తెలియదు కానీ.. కరాటే కళ్యాణితో పెట్టుకున్న వివాదం కారణంగా గత కొన్ని రోజులుగా సోషల్ మీడియా, డిజిటల్ మీడియా, కొన్ని ప్రధాన మీడియా చానెల్స్‌లో కూడా దర్శనమిస్తున్నాడు. అసలు ఈ వివాదంలో తప్పు ఎవరది అనే విషయం మీద ఇంక జనాలకు స్పష్టతలేదు. ఇక వీరిద్దరి మధ్య ప్రారంభమైన వివాదం.. చివరకు పిల్లల అక్రమ రవాణా వరకు సాగింది. కరాటే కళ్యాణి.. పిల్లలను అక్రమంగా తెచ్చుకుంది అనే ఆరోపణలు రావడం.. ఆమె ఇంటికి చైల్డ్ వెల్ఫేర్ అధికారులు వెళ్లడం.. ఈ క్రమంలో ఆమె 24 గంటల పాటు అజ‍్ఞాతంలోకి వెళ్లడం.. ఆపై మీడియా ముందుకు రావడం జరిగింది. ప్రస్తుతానికి ఈ వివాదానికి ఎండ్ కార్డ్ పడినట్లే భావిస్తున్నారు. మరి కొత్త వివాదాలు వెలుగులోకి వస్తాయేమో చూడాలి.
ఇక ఈ వివాదం సంగతి ఎలా ఉన్నా యూట్యూబర్ శ్రీకాంత్‌కు బంపరాఫర్ తగిలినట్లు వార్తలు వినిపిస్తున్నాయి. అదేంటంటే.. త్వరలోనే ప్రారంభం కాబోయే బిగ్ బాస్ సీజన్ 6లో పాల్గొనే అవకాశం లభించినట్లు జోరుగా వార్తలు ప్రచారం అవుతున్నాయి. బిగ్‌బాస్ నాన్‌స్టాప్ ముగింపుకు వచ్చేసింది. అఖిల్ సార్థక్, బిందు మాధవిలలో ఎవరు ఒకరు టైటిల్ ఎగరేసుకుపోనున్నారు. టాప్ 5కి చేరుకునేవారిలో నుంచి కొందరిని బిగ్‌బాస్ ఆరో సీజన్‌కు సైతం తీసుకోనున్నారు. ఆ జాబితాలో జనాలను ఎంటర్‌టైన్ చేసే యాంకర్ శివ తప్పకుండా ఉండే అవకాశముంది. అలాగే ఆరో సీజన్ కోసం ఇప్పటినుంచే కంటెస్టెంట్ల ఎంపిక మొదలైంది. బిగ్‌బాస్ టీమ్ రోషన్, మంజూష అనే మరో ఇద్దరు యాంకర్లను సైతం సంప్రదించే అవకాశాలున్నట్లు ప్రచారం జరుగుతోంది.
ఇది కూడా చదవండి: Swathi Naidu: కరాటే కళ్యాణి పై స్వాతినాయుడు కామెంట్స్! వీడియో వైరల్!
తాజాగా సీజన్ 6లో ఓ యూట్యూబర్ బిగ్‌బాస్‌లోకి వెళ్లనున్నట్లు ప్రచారం జరుగుతోంది. ప్రాంక్ వీడియోలతో పాపులర్ అయిన శ్రీకాంత్ రెడ్డి బిగ్‌బాస్ ఆరో సీజన్‌లో పాల్గొనే అవకాశాలున్నట్లు ఊహాగానాలు ఊపందుకున్నాయి. మరి ఇదెంతవరకు నిజం? ఒకవేళ పిలుపు వస్తే నిజంగానే బిగ్‌బాస్ హౌస్‌కి వెళ్తాడా? లేదా? అన్నది తేలాల్సి ఉంది. ఇక బిగ్ బాస్ 6 లో పాల్గొనేవారు వీరే అంటూ ఇప్పటికే పలువురు పేర్లు తెరమీదకు వస్తున్నాయి. ఆయా జాబితాలో ఉన్న వారు అందరూ కాకపోయినా.. కొందరైనా బిగ్ బాగ్ హౌజ్‌లో కనిపించే చాన్స్ ఉంది. అలానే ప్రస్తుతం వైరలవుతున్న జాబితాలో శ్రీకాంత్ రెడ్డ పేరు కూడా ఉన్నట్లు సమాచారం. మరి అతడు హౌజ్‌లోకి వెళ్తాడో లేదో తెలియాలంటే కొన్ని రోజులు ఆగాల్సిందే. మరి దీనిపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.