బిగ్‌బాస్..బుల్లితెరపై అల్లరి చేసే ఓ రియాలిటీ షో. ఇందులో పాల్గొనేందుకు ఫేమస్ స్టార్స్ పోటీ పడుతుంటారు. అయితే ఇప్పుడు తెలుగు, హింది అనే భాషలతో తేడా లేకుడా దక్షిణాది వ్యాప్తంగా విపరీతంగా ఆకట్టుకుంటోంది ఈ బిగ్‌బాస్. ఇక బుల్లితెరపైనే కాకుండా తాజాగా ఓటీటీలోనూ ప్రారంభమైంది ఓటీటీ బిగ్‌బాస్. కరోణ్ జోహార్ హోస్ట్‌గా వ్యవహరిస్తున్న హిందీ ఓటీటీ బిగ్‌బాస్ ప్రారంభమైంది.
ఇక ఈ బిగ్‌బాస్‌లోకి తీసుకోవాలంటూ నటి రాఖీసావంత్ హల్చల్ చేస్తోంది. సూట్‌కేసుతో నేరుగా ఓటీటీ హౌస్‌కు చేరుకుని రోడ్డుపై వినూత్న రీతిలో నిరసన తెలియజేసింది. నటి రాఖీసావంత్ స్పైడర్‌మెన్ డ్రెస్‌ను దరించి ముంబాయి వీధులన్నీ కలియ తిరిగింది. దీంతో ఆగకుండా రోడ్డుపై డ్యాన్స్‌లు చేస్తూ నానా హంగామా చేసింది. ఇక ఈమె రచ్చను తట్టుకోలేక అభిమానులు ఏంటంటూ ప్రశ్నిస్తున్నారు. ఇక దీనికి సంబంధించిన వీడియోలు, ఫోటోలు సోషల్ మీడియాలో తెగ హల్చల్ చేస్తున్నాయి. నటి రాఖీసావంత్ వ్యవహరిస్తున్న తీరుపై మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో మాకు తెలియజేయండి.