నిర్మాత బన్నీ వాస్ పై.. మిస్ సునీత బోయ అనే అమ్మాయి గత కొన్ని రోజులుగా ఆరోపణలు చేస్తున్న విషయం తెలిసిందే. అయితే.., ఇన్నాళ్లు ఈ విషయంపై నేరుగా స్పందించని బన్నీ వాస్ తొలిసారి స్పందించారు. ఈ నేపధ్యంలోనే బన్నీ వాసు వెర్షన్ ని తెలియజేస్తూ ఓ ప్రెస్ నోట్ విడుదల అయ్యింది.
“2019 నుంచి ఇప్పటి వరకు సునీత బోయ.. గీతా ఆర్ట్స్ సంస్థ.. అలాగే నిర్మాత బన్నీ వాస్ పై నిరాధారమైన ఆరోపణలు చేస్తుంది. ఆమె సమాజంలో ప్రముఖులను లక్ష్యంగా చేసుకునేది. అంతేకాకుండా ఎప్పటికప్పుడు హెడ్ లైన్స్‌లో ఉండటానికి.. కావాలనే వివాదాస్పద విషయాల్లో వేలు పెట్టడం.. వాటికి సంబంధించిన డిబేట్స్‌లో పాలు పంచుకోవడం చేస్తుంది. ఇలాంటి పనులు ముందు నుంచే చేస్తున్న సునీత.. దాదాపు అన్నింట్లోనూ విజయం సాధించింది. ఒక్క గీతా ఆర్ట్స్ సంస్థ, బన్నీ వాస్ విషయంలో తప్ప. వాళ్లు ఈమె బెదిరింపులకు, అబద్ధపు ఆరోపణలకు లొంగలేదు, బెదరలేదు. ఈమె జీవితంలో ఏదో బాధలో ఉండుంటుందని భావించి.. సునీత ఆరోపణలపై బన్నీ వాస్ ఏ మాత్రం స్పందించలేదు. సినిమా ఇండస్ట్రీలోనూ అవకాశాల కోసం ప్రయత్నించి విఫలమై ఉంటుందేమో అనే జాలితో వదిలేసారు. కానీ.., ఆమె మాత్రం అవాస్తవ ఆరోపణలు చేయడం మానలేదు.
సోషల్ మీడియా వేదికలైన ఇన్‌స్టాగ్రామ్, యూ ట్యూబ్, ఫేస్ బుక్ లాంటి చోట్ల అసభ్యకరమైన పదజాలంతో ఆమె ఆరోపణలు చేస్తుంది. అలాగే బన్నీ వాస్ 4 సంవత్సరాల కుమార్తెను చంపాలనే ఆలోచనలు తనకు వస్తున్నాయని సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్‌లో ఆమె ఒక వీడియోను పోస్ట్ చేసింది. ఆమె ఇంతకి దిగజారిన తర్వాత.. మరో దారి లేక బన్నీ వాస్ న్యాయబద్ధంగా పోరాడాలని.. పోలీసులతో పాటు గౌరవ న్యాయస్థానం వైపు అడుగులు వేసారు.
పోలీసులను ఆశ్రయించిన తర్వాత బన్నీ వాస్ పై మరింత పగ పెంచుకున్న సునీత బోయ.. తన వేధింపులను తారాస్థాయికి తీసుకెళ్లింది. ఇదంతా పూర్తిగా అబద్ధమని బన్నీ వాస్ తెలియజేసారు. అసలు విచిత్రం ఏంటంటే ఏ రోజు కూడా సునీత బోయ అనే అమ్మాయిని బన్నీ వాస్ కలవలేదు. అసలు పరిచయమే లేని వాస్ పై.. ఇలాంటి నిరాధారమైన ఆరోపణలు చేస్తుంది సునీత. అయినా కూడా ఓపిగ్గా భరిస్తున్న బన్నీ వాస్ .. ఈ విషయాన్ని కేవలం చట్ట ప్రకారం మాత్రమే పరిష్కరించుకోవాలని చూస్తున్నారు. అందుకే న్యాయపరమైన ప్రక్రియను అనుసరిస్తున్నారు.కాబట్టి అందరికీ తెలియజేసిజి ఏమనగా .. దయచేసి ఇలాంటి తప్పుడు ఆరోపణలు చేసే వ్యక్తులను ప్రోత్సహించొద్దని మనవి.
లైమ్ లైట్‌లో ఉండటానికి ఈమె చేసే తప్పుడు ఆరోపణలను మీడియా ఎలాంటి కథనాలను కూడా ప్రచురించవద్దని హృదయపూర్వక విన్నపం. బన్నీ వాస్ పై ఎలాంటి ఆరోపణలు చేయొద్దని.. HRCతో పాటు సంబంధిత గౌరవ విచారణ, జిల్లా హైకోర్టులలో ఈమెకు వార్నింగ్స్ వచ్చాయి. అయినా కూడా పట్టించుకోకుండా అలాగే ఆరోపణలు చేస్తుంది. సమస్యలు పరిష్కారం అయ్యేవరకు ఆరోపణలు చెప్పినా అలాగే చేయడం అనేది కోర్టు ధిక్కరణే. తీర్పు వచ్చిన తర్వాత కచ్చితంగా మీడియా ముందుకు వచ్చి జరిగిన వాస్తవాలన్నింటిని వివరిస్తాము. అంతేకాదు దీని వెనుక ఉన్న వ్యక్తులపై తప్పనిసరిగా చట్టపరమైన చర్యలు తీసుకుంటాం”. ఇది బన్నీ వాసు నుండి వచ్చిన ప్రెస్ నోట్. మరి.. ఏ వివరణపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.
మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం SumanTV App డౌన్లోడ్ చేసుకోండి.