హీరోయిన్స్ ఇండస్ట్రీకి దూరమైపోతే.. గుర్తుపట్టలేనంతగా ఛేంజ్ అయిపోతారు. సడన్ గా చూస్తే ఎవరా అనుకుంటాం! 'బన్నీ' హీరోయిన్ కూడా అలాంటి లుక్ లోనే తాజాగా కనిపించింది.
హీరోయిన్స్ ఎవరైనా సరే కెరీర్ చాలా జాగ్రత్తగా ప్లాన్ చేసుకోవాలి. లేదంటే పూర్తిగా కనిపించకుండా పోతారు. ఏళ్లకు ఏళ్లు ఇండస్ట్రీలో కొనసాగాలంటే గ్లామర్ ఉంటే సరిపోదు. దానితోపాటు కూసింత అదృష్టం ఉండి తీరాలి. టాలీవుడ్ లోకి ప్రతి ఏడాది పదుల సంఖ్యలో హీరోయిన్లు వస్తుంటారు. అదే టైంలో పాతవాళ్లు ఎగ్జిట్ అవుతుంటారు. చాన్నాళ్లు గడిచిన తర్వాత మళ్లీ ఎక్కడో ఓ చోట కనిపిస్తే.. వాళ్లని గుర్తుపట్టడమే కష్టమైపోతుంది. ఎందుకంటే అంతలా మారిపోతారు. ‘బన్నీ’ హీరోయిన్ ఇప్పుడు చూసిన చాలామంది సేమ్ అదే అనుకుంటున్నారు.
అసలు విషయానికొస్తే.. అల్లు అర్జున్ కమర్షియల్ హిట్ మూవీస్ చూసుకుంటే అందులో ‘బన్నీ’ కచ్చితంగా ఉంటుంది. కామెడీ, డ్రామా, ఎమోషన్స్.. ఇలా అన్ని ఉన్న ఫెర్ఫెక్ట్ ఎంటర్ టైనర్ గా నిలిచింది. ఇందులో హీరోహీరోయిన్ల కెమిస్ట్రీ అయితే చాలా బాగా వర్కౌట్ అయింది. హీరోయిన్ గా చేసిన గౌరీ ముంజల్.. ఆ తర్వాత పలు సినిమాలు చేసినప్పటికీ ‘బన్నీ’ తీసుకొచ్చినంత పేరు అయితే తీసుకురాలేకపోయాయి. దిల్లీలో పుట్టి పెరిగిన ఈ భామ.. హీరోయిన్ అవుదామని ముంబయికి వచ్చింది. ‘బన్నీ’ మూవీతో హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చింది.
అల్లు అర్జున్ తో మూవీ హిట్ కావడంతో తెలుగుతో పాటు తమిళ, కన్నడ, మలయాళ సినిమాల్లో నటించింది. అలా దాదాపు ఆరేళ్లలో 16 మూవీస్ చేసింది. కానీ చిత్రాలని ఎంపిక చేసుకోవడంలో సరైన శ్రద్ధ చూపించలేదో ఏమో గానీ వరస ఫ్లాప్స్ చవిచూసింది. అలా ఈమెకు ఛాన్సులు రాకుండా పోయాయి. దీంతో 2011 తర్వాత దిల్లీ వెళ్లిపోయింది. అక్కడే బిజినెస్ చేస్తూ సెటిలైపోయింది. 40కి దగ్గర్లో ఉంది కానీ ఇప్పటికీ సింగిల్ గానే ఉండిపోయింది. రీసెంట్ గా కొన్నాళ్ల ముందు ఓ ఈవెంట్ లో కనిపించగా, అప్పుడు తీసుకున్న కొన్ని ఫొటోలు బయటకొచ్చాయి. వీటిని చూసి నెటిజన్స్ ఆశ్చర్యపోతున్నారు. బన్నీ హీరోయిన్ ఇలా మారిపోయిందేంటి? అని అనుకుంటున్నారు. మరి ‘బన్నీ’ హీరోయిన్ ప్రెజెంట్ లుక్ పై మీ అభిప్రాయాన్ని కింద కామెంట్స్ లో పోస్ట్ చేయండి.