బుల్లితెరపై ఎన్నో కామెడీ షోలు వస్తుంటాయి పోతుంటాయి. కానీ ప్రేక్షకుల గుండెల్లో నిలిచిపోయిన ఒకేఒక కామెడీ షో ‘జబర్దస్త్’. గత 9 సంవత్సరాలుగా అలుపెరగకుండా సాగుతున్న ఏకైక కామెడీ షో జబర్దస్త్. ఇక ఈ షో ద్వారా అనేక మంది టాలెంటెడ్ కమెడీయన్లు వెలుగులోకి వచ్చారు. ఈ క్రమంలోనే జబర్దస్త్ కు అనేక మంది నటీ, నటులు జడ్జిలుగా వచ్చిన సంగతి మనందరికి తెలిసిందే. నాగబాబు, రోజా, సింగర్ మనో, ఇంద్రజ, కుష్బూ, స్టార్ కమెడీయన్ కృష్ణ భగవాన్ లు జడ్జీలుగా చేశారు. ప్రస్తుతం ఇంద్రజ, కుష్బూ, కృష్ణ భగవాన్ ను జడ్జీలుగా చేస్తున్నారు. కాగ నవంబర్ 25 ఎపిసొడ్ కు సంబంధించిన ప్రోమోను తాజాగా రిలీజ్ చేశారు మేకర్స్. ఈ ప్రోమోలో బుల్లెట్ భాస్కర్ తో చిందేశారు అలనాటి అందాల తార నటి కుష్బూ. సింప్లీ సూపర్బ్ స్టెప్పులతో అదరగొట్టింది. ప్రస్తుతం ఈ వీడియో నెట్టింట వైరల్ గా మారింది.
కుష్బూ.. 80, 90 దశకంలో సినీ అభిమానుల గుండెలను కొల్లగొట్టింది కుష్బూ. దాంతో ఆమె నటనకు ఫిదా అయిన అభిమానులు ఏకంగా కుష్బూకు దేవాలయాన్నే కట్టించారు. అయితే వయసు మీద పడుతున్న కొద్ది ఆమె తల్లి, అక్క పాత్రలను వేయడం స్టార్ట్ చేసింది. ఈ క్రమంలోనే బుల్లితెర నంబర్ వన్ కామెడీ షో జబర్దస్త్ కు జడ్జీగా ఎంట్రీ ఇచ్చింది. తనదైన నవ్వుతో, అందంతో, మాటలతో జడ్జీగా సైతం దూసుకెళ్తోంది. తాజాగా ఎక్స్ ట్రా జబర్దస్త్ నవంబర్ 25 ఎపిసోడ్ కు సంబంధించిన ప్రోమో ను తాజాగా రిలీజ్ చేశారు మేకర్స్. ఎప్పటిలాగే ఈ ప్రోమో కూడా ఫుల్ లెన్త్ పంచులతో ఆకట్టుకుంది. ఇక ఈ ఎపిసోడ్ కు హైలెట్ అంటే కుష్బూ-బుల్లెట్ భాస్కర్ ల డ్యాన్స్ అనే చెప్పాలి. కాంచన మూవీలోని ‘నలుపు నేరేడంటి కళ్లే’ అనే పాటకు ఇద్దరు కలిసి సూపర్ గా స్టెప్పులేశారు. కుష్బూ ఎప్పటిలాగే తన గ్రేస్ ఏ మాత్రం తగ్గలేదని మరోసారి నిరూపించుకుంది. ఈలలు గోలలతో జబర్దస్త్ స్టేజ్ మెుత్తం రచ్చ రచ్చగా మారింది. ఆ తర్వాత యాంకర్ రష్మీ కూడా వారితో చివర్లో కాలుకదిపింది. ప్రస్తుతం ఈ వీడియో వైరల్ గా మారింది.