పవర్ స్టార్ పవన్ కల్యాణ్ సినిమాలో ఒక్క ఛాన్స్ వచ్చినా చాలని చాలా మంది అనుకుంటారు. అలాంటిది ఆయన చిత్రంలో విలన్ పాత్రలో నటించాలంటూ ఒక ప్రముఖ రాజకీయ నేతకు ఆఫర్ ఇచ్చారంటూ సోషల్ మీడియాలో ప్రచారం జరుగుతోంది. అయితే ఆఫర్ రావడం నిజమే అని సదరు బీఆర్ఎస్ మంత్రి వెల్లడించారు.
పవర్ స్టార్ పవన్ కల్యాణ్‌కు ప్రేక్షకుల్లో ఉన్న ఫాలోయింగ్ గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. హిట్లు, ఫ్లాపులతో సంబంధం లేకుండా పవన్ సినిమాలు చేసుకుంటూ పోతున్నారు. ఆయనకు సాలిడ్ హిట్ పడితే బాక్సాఫీస్ షేక్ అవ్వడం ఖాయం. పవర్ స్టార్ సరసన ఒక్క చిత్రంలోనైనా నటించాలని చాలా మంది ఆర్టిస్టులు కోరుకుంటారు. పవన్ పక్కన ఒక్క సీన్లో కనిపించినా తమకు క్రేజ్ వచ్చేస్తుందనో ఏమో కాబోలు.. ఆయన మూవీలో ఛాన్స్ కోసం ఎదురు చూస్తారు. అలాంటి పవన్ కల్యాణ్ సినిమాలో ఓ ఫేమస్ పొలిటీషియన్‌కు నటించే అవకాశం వచ్చిందట. ఆ లీడర్ ఎవరో కాదు.. బీఆర్ఎస్ నేత, మంత్రి మల్లారెడ్డి. అది కూడా మామూలు పాత్ర కాదట. పవన్ సినిమాలో ఏకంగా విలన్ రోల్లో యాక్ట్ చేయాలని మల్లారెడ్డికి ఆఫర్ వచ్చింది.
పవన్‌తో తదుపరి చిత్రం తీయబోతున్న స్టార్ డైరెక్టర్ హరీష్ శంకర్ ఈ ఆఫర్‌ను మల్లారెడ్డికి ఇచ్చారట. అయితే ఆయన దీన్ని సున్నితంగా తిరస్కరించారు. ఈ విషయాన్ని ఆయనే స్వయంగా వెల్లడించారు. దర్శకుడు హరీష్ శంకర్ తనను కలిశారని.. రెండు తెలుగు రాష్ట్రాల్లో ఉన్న క్రేజ్ దృష్ట్యా తనకు విలన్ రోల్ ఆఫర్ చేశారని.. అది కూడా పవన్ కళ్యాణ్ సినిమాలో విలన్ గా చేయమని అడిగారని అన్నారు. అయితే విలన్ గా చేసేందుకు తాను ఒప్పుకోలేదని అన్నారు. ఇక, పవన్ కల్యాణ్ ప్రస్తుతం ‘హరిహర వీరమల్లు’ చిత్రంలో నటిస్తున్నారు. క్రిష్ తెరకెక్కిస్తున్న ఈ మూవీ షూటింగ్ ముగింపు దశకు వచ్చినట్లు తెలుస్తోంది.
‘హరిహర వీరమల్లు’ చిత్రీకరణలో పాల్గొంటూనే సమాంతరంగా మరో సినిమా షూట్లోనూ పవర్‌స్టార్ పాల్గొంటున్నారు. మేనల్లుడు సాయి తేజ్‌తో తీస్తున్న మల్టీస్టారర్ మూవీ చిత్రకరణలోనూ పవన్ భాగమవుతున్నారు. ఈ సినిమా షూటింగ్‌ను సాధ్యమైనంత త్వరగా పూర్తి చేయాలని ఆయన ఫిక్స్ అయ్యారట. ఆ తర్వాత హరీష్ శంకర్ తీస్తున్న ఫిల్మ్ పనుల్లో పవన్ భాగమవుతారని తెలుస్తోంది. ఏపీలో అసెంబ్లీ ఎన్నికలకు సమయం దగ్గర పడుతున్నందున తన చేతిలో ఉన్న ప్రాజెక్టులను సాధ్యమైనంత త్వరగా పూర్తి చేయాలని పవన్ ఫిక్స్ అయినట్లు సమాచారం. మరి.. పవన్ సినిమాలో మల్లారెడ్డి నటిస్తే చూడాలని అనుకుంటున్నారా? అయితే మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.
పవన్ కళ్యాణ్ సినిమాలో విలన్ వేషం వేయమని హరీష్ శంకర్ నన్ను అడిగాడు – మంత్రి మల్లా రెడ్డి#Pawanakalyan #MallaReddy #Telangana pic.twitter.com/ARlVBUBdth
— Telugu Scribe (@TeluguScribe) March 26, 2023