Suriya – Kajal: సాధారణంగా భారీ యాక్షన్, పీరియాడిక్, సైన్స్ ఫిక్షన్, హార్రర్ సినిమాలలో మనం ఎక్కువగా గ్రాఫిక్స్ వర్క్ చూస్తుంటాం. ఆయా సినిమాలలో ఎన్నో విజువల్ ట్రీట్ కలిగించే సన్నివేశాలను కంప్యూటర్ గ్రాఫిక్స్(CG)లో క్రియేట్ చేస్తుంటారు మేకర్స్. అయితే.. థియేటర్ స్క్రీన్ పై ఆ విజువల్స్ చూసి ఫ్యాన్స్ పండగ చేసుకుంటారు. కానీ.. అలాంటి విజువల్స్, ఆనాటి వాతావరణం క్రియేట్ చేయడానికి తెరవెనుక మేకర్స్ పడే కష్టాన్ని చూస్తే ఖచ్చితంగా ఆశ్చర్యం కలుగుతుంది.
ఇక సినిమాలలో యాక్షన్ సన్నివేశాల కోసం కంప్యూటర్ గ్రాఫిక్స్ ఉపయోగించారంటే ఓకే. కానీ.. సినిమాలో రొమాంటిక్ సీన్స్, కిస్సింగ్ షాట్స్ కోసం కూడా గ్రాఫిక్స్ ఉపయోగించడం అనేది సర్ప్రైజింగ్ గా అనిపించినా.. సినీ ఇండస్ట్రీలో ఇవన్నీ మామూలే. కాకపోతే రెగ్యులర్ కమర్షియల్ సినిమాలలో భారీ ఫైట్స్, యాక్షన్ సీక్వెన్సులు, ఛేజింగ్ సీన్స్ తెరకెక్కించడానికి ఎంత కష్టపడతారో.. చిన్న కిస్సింగ్ సీన్ చేయడానికి కూడా అంతే కష్టపడుతుంటారు.
ఈ విషయాన్ని స్టార్ హీరో సూర్య, కాజల్ అగర్వాల్ జంటగా నటించిన సూపర్ హిట్ మూవీ ‘బ్రదర్స్’లో గమనించవచ్చు. ఈ సినిమాలో సూర్య కవలలుగా శరీరాలు అంటుకున్న పాత్రలో నటించాడు. అయితే.. ఈ ట్విన్స్ లో హీరోయిన్ కాజల్ ని ప్రేమిస్తాడు. ఈ క్రమంలో హీరోయిన్ తో కలిసి సినిమాకి వెళ్లిన సూర్య.. థియేటర్లో కాజల్ ని ముద్దాడే సన్నివేశం ఒకటి ఉంటుంది. థియేటర్లో ఆ సీన్ చూసి నిజంగానే సూర్య – కాజల్ ముద్దు పెట్టుకున్నారని అనుకుంటాం.
వాస్తవానికి ఆ సన్నివేశంలో సూర్య – కాజల్ అక్కడ లేకపోవడం గమనార్హం. అదీగాక వాళ్లిద్దరూ కిస్ చేసుకున్న సీన్ అంతా గ్రాఫిక్స్ మాయాజాలమే. దర్శకుడు కేవీ ఆనంద్ రూపొందించిన ఈ సినిమాలో.. ముద్దు సీన్ ని సపరేట్ గా షూట్ చేశారు మేకర్స్. మొదట కాజల్ తో ఓ బాల్ కి ముద్దు పెట్టించారు. ఆ తర్వాత సూర్యతో ఓ గ్లాస్ కి కిస్ చేయించారు. అనంతరం.. సీజీలో ఈ ఇద్దరి షాట్స్ ని కలిపి ప్రేక్షకులను మాయచేశారు. ప్రస్తుతం సూర్య – కాజల్ ముద్దు సీన్ మేకింగ్ వీడియో నెట్టింట వైరల్ అవుతోంది. మరి ఈ వీడియో పై మీ అభిప్రాయాలను కామెంట్స్ లో తెలియజేయండి.