తెలుగు ఇండస్ట్రీలో మెగాస్టార్ చిరంజీవికి ఎంత గొప్ప క్రేజ్ ఉందో ప్రత్యేకంగా చెప్పనక్కరలేదు. పదేళ్ల విరామం తర్వాత వివివినాయక్ దర్శకత్వంలో ఖైదీ నెంబర్ 150 తో మళ్లీ వెండితెరకు రీఎంట్రీ ఇచ్చి తన సత్తా ఏ మాత్రం తగ్గలేదని నిరూపించారు. అనంతరం సైరా నర్సింహ రెడ్డిలో మరోసారి ప్రేక్షకులను మంత్ర ముగ్ధుల్ని చేశారు చిరు. ప్రస్తుతం కొరటాల దర్శకత్వంలో చిరు-రామ్ చరణ్ లు కలిసి నటిస్తున్న ‘ఆచార్య’ రిలీజ్ కి సిద్దంగా ఉంది. ఇటీవల కరోన నేపథ్యంలో సినిమాలకు బ్రేక్ పడిన విషయం తెలిసిందే.
కరోనా సెకండ్ వేవ్ తగ్గుముఖం పట్టిన తర్వాత ఇప్పుడు వరుస సినిమాలతో దూసుకుపోతున్నారు. మలయాళంలో మోహన్ లాల్ హీరోగా నటించిన ‘లూసీఫర్’ రీమేక్‌ను తెలుగులో ‘గాడ్ ఫాదర్’ టైటిల్‌గా రీమేక్ చేస్తోన్న సంగతి తెలిసిందే. ఈ సినిమాలో బాలీవుడ్ సూపర్ స్టార్ సల్మాన్ ఖాన్ కీలక పాత్ర పోషించనున్నట్లు టాలీవుడ్ సినీ వర్గాలు చర్చించుకుంటున్నాయి. అంతే కాదు.. ఈ సినిమాలో చిరు, సల్మాన్ ఖాన్ కోసం ఓ పాటను ప్లాన్ చేసి సమాచారం. ఇక తెరపై ఇద్దరూ కలిసి డాన్స్ చేస్తే ఎలా ఉంటుందో చెప్పాల్సిన పనిలేదు. చిరంజీవి-సల్మాన్ తొలిసారి తెరను పంచుకోవడంతో ఏకంగా హాలీవుడ్ ఫేమస్ సింగర్ బ్రిట్నీ స్పియర్ రంగంలోకి దింపేందుకు తమన్ ప్రయత్నాలు చేస్తున్నట్లు సినీ వర్గాల్లో గుసగుసలు వినిపిస్తున్నాయి.
ఇందుకోసం హాలీవుడ్ సింగర్ బ్రిట్నీ స్పియర్ తో చర్చలు జరుపుతున్నట్లు ఫిలిమ్ వర్గాల్లో టాక్ నడుస్తుంది. మరి బ్రిట్నీ స్పియర్స్ తెలుగులో పాట పాడేందుకు ఒప్పుకుంటారా లేదా అని అధికారిక ప్రకటన వచ్చే వరకు వేచి చూడక తప్పదు. మరి నిర్మాతలు కూడా ఆమె అడిగినంతా ఇచ్చేందుకు సిద్దంగా ఉన్నారా అని సోషల్ మీడియా లో కామెంట్లు చేస్తున్నారు. ఏది ఏమైనా వెండితెరపై బాలీవుడ్ కండల వీరుడు సల్మాన్ ఖాన్.. టాలీవుడ్ మెగాస్టార్ చిరంజీవి ఒకే ఫ్రేమ్ లో కనిపిస్తే ఫ్యాన్స్ కి పూనకాలే అంటున్నారు. ఈ చిత్రానికి మోహన్ రాజా దర్శకత్వం వహిస్తున్నారు.