ఈ మద్య ఇండస్ట్రీలో వరుస విషాదాలు చోటు చేసుకుంటున్నాయి. పలువురు సినీ ప్రముఖులు, దర్శక, నిర్మాతలు ఇంతర సాంకేతిక రంగానికి చెందిన వారు కన్నుమూస్తున్నారు. తాజాగా నటి, బ్రెజిల్ మాజీ మోడల్, స్నైపర్.. థాలిట డో వల్లె కన్నుమూసింది.
గత కొన్ని రోజులుగా రష్యా-ఉక్రెయిన్ ల మద్య భీకర యుద్దం కొనసాగుతుంది. రష్యా ఉక్రెయిన్‌పై చేస్తున్న యుద్ధంలో సైనికులతో పాటు ఎంతో మంది సామాన్య పౌరులు కూడా మరణిస్తున్నారు. ఆ దేశానికి సహాయంగా వచ్చిన విదేశీయులు రష్యాకు వ్యతిరేకంగా జరుగుతున్న పోరాటంలో తమ ప్రాణాలను కోల్పోతున్నారు. ఈ క్రమంలో ఉక్రెయిన్ తరఫున స్నైపర్‍గా బరిలోకి దిగి రష్యా సేనలకు అడ్డుకునే క్రమంలో ప్రాణాలు కోల్పోయింది నటి, మోడల్ థాలిట డో వల్లె.
లా చదివిన థాలిట కొన్నాళ్లు మోడల్‌గా, నటిగా పనిచేసింది. లా చదువుతున్న సమయంలో ఆమె ఎన్నో సామాజిక సేవా కార్యక్రమాల్లోపాల్గొంది. ఎన్‌జీఓలతో కలిసి ప్రాణాపాయ స్థితిలో ఉన్న జంతువులను కాపాడే కార్యక్రమాల్లో పాల్గొంటూ ఉండేది. సాయుధ దళంలో పనిచేసి స్నెపర్ షూటింగ్ లో మంచి ప్రావిణ్యం సంపాదించింది థాలిట. ఈ అనుభవంతోనే ఆమె ఉక్రయిన్ తరుపు నుంచి యుద్దంలో పాల్గొంది. థాలిట సోదరుడు మాట్లాడుతూ.. తన సోదరి గొప్ప యోధరాలు.. హీరో అన్నారు. ఆమె ఎంతో మంది ప్రాణాలు కాపాడిందని, మనవతా కార్యక్రమాల్లో పాలుపంచుకునేందుకు ఆమె దేశాలు సంచరిస్తుంటుందని పేర్కొన్నాడు.
చివరి నిమిషం వరకు ఆమె దేశం కోసం పనిచేసిందని.. రష్యన్ బలగాలు సమీపిస్తున్నాయని, ఫోనులో మాట్లాడితే శత్రువు డ్రోన్లకు దొరికిపోయే ప్రమాదం ఉందని కనీసం ఫోన్ కూడా మాట్లాడలేని పరిస్తితి ఉందని ఆవేదన చెందాడు. మోడల్ గా కెరీర్ ఆరంభించిన ఆమె ఎంతో భవిష్యత్ ఉన్నప్పటికీ.. దేశంలో కోసం ప్రాణాలు అర్పించింది. ఆమె త్యాగానికి దేశ వ్యాప్తంగా నివాళులర్పిస్తున్నారు. ఈ విషయంపై మీ అభిప్రాయాలు కామెంట్స్ రూపంలో తెలియజేయండి.