హాస్య నటుడు బ్రహ్మానందం రాజకీయ ఇన్నింగ్స్ మొదలు పెట్టారా..? అంటే అవుననే సమాధానం వినిపిస్తోంది. అందుకు ఈ ఎన్నికల ప్రచారమే.. ఓ ప్రత్యక్ష ఉదాహరణ. కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ నేపథ్యంలో బ్రహ్మానందం ఓ బీజేపీ నేత తరుపున ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నారు. "ఏయ్ గేమ్స్ ఆడొద్దు.. శాల్తీలు లేచిపోతాయి.." అంటూ మాస్ డైలాగ్స్ తో జనాలను ఉత్సాహపరిచారు.
‘సినిమాలు, రాజకీయాలు..’ ఇవి రెండు వేరు వేరు ప్రపంచలైనా వీటి మధ్య ఉన్న సంబంధం అందరకీ విధితమే. సినిమా ప్రపంచం నుంచి రాజకీయాల్లోకి ఎంట్రీ రాష్ట్రాన్ని ఏలిన వారు ఎందరో ఉన్నారు. ఎన్‌టీఆర్, ఎంజిఆర్, జయలలిత వీరందరూ సినిమాల్లో సత్తా చాటిన వారే.. ముఖ్యమంత్రులుగా రాష్ట్రాలను పాలించిన వారే. ప్రస్తుతానికి ఇదే దారిలో జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్, మక్కల్ నీధి మయం అధ్యక్షుడు కమల్ హాసన్, శరత్ కుమార్ వంటి నాయకులు కూడా ఉన్నారనుకోండి. తాజా పరిణామాలు చూస్తుంటే తెలుగు హాస్య నటుడు బ్రహ్మానందం కూడా త్వరలోనే రాజకీయ ఇన్నింగ్స్ మొదలు పపెట్టే ప్రయత్నాల్లో ఉన్నట్లు తెలుస్తోంది. అందుకు ఈ ఎన్నికల ప్రచారమే.. ఓ ప్రత్యక్ష ఉదాహరణ.
కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ కు సమయం దగ్గరపడుతుండటంతో రాజకీయ పార్టీలన్నీ ప్రచారాన్ని ముమ్మరం చేస్తున్నాయి. ఈ నేపథ్యంలో బ్రహ్మానందం ఎన్నికల ప్రచారంలో పాల్గొనడం ప్రాధాన్యతను సంతరించుకుంది. మాజీ కర్ణాటక వైద్యారోగ్య శాఖ మంత్రి కే సుధాకర్ తరఫున బ్రహ్మానందం ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నారు. ఈ ఎన్నికల్లో కే సుధాకర్ చిక్కబళ్లాపూర్ నుంచి బీజేపీ అభ్యర్థిగా బరిలో ఉన్నారు. ఈ నేపథ్యంలో బ్రహ్మానందం ఆ నియోజకవర్గంలోని పలు ప్రాంతాల్లో గురువారం ప్రచారం నిర్వహించారు. ఈ క్రమంలో ఓటర్లను ఉద్దేశించి మాట్లాడిన ఆయన.. ‘సుధాకర్‌ను గెలిపించాలని కోరారు.. తాను హైదరాబాద్ నుంచి ఇక్కడకి వచ్చానని.. ఆయన ఎంతమంచివాడో మనందరికీ తెలుసునని.. కావున ఆయనను తప్పకుండా గెలిపించాలని ఓటర్లకు విజ్ఞప్తి చేశారు. అలాగే.. “ఏయ్ గేమ్స్ ఆడొద్దు.. శాల్తీలు లేచిపోతాయి..” అంటూ మాస్ డైలాగ్స్ తో జనాలను ఉత్సాహపరిచారు.
Telugu film star & Comedian
“Brahmanandam “will campaign for BJP in Chikkaballapur assembly constituency for
Chikkaballapur – BJP MLA K Sudhakar pic.twitter.com/dCk5nP7gWH
— narne kumar06 (@narne_kumar06) May 4, 2023
కే సుధాకర్ 2013, 2018 అసెంబ్లీ ఎన్నికల్లో చిక్కబళ్లాపూర్ నుంచి కాంగ్రెస్ అభ్యర్థిగా విజయం సాధించారు. అయితే 2019లో కాంగ్రెస్-జేడీఎస్‌లకు చెందిన కొందరు ఎమ్మెల్యేలతో పాటు ఆయన కూడా బీజేపీ దగ్గరయ్యారు. ఈ క్రమంలోనే అనర్హత వేటు ఎదుర్కొని.. ఉప ఎన్నికలకు వెళ్లి మరోసారి విజయం సాధించారు. ఆ సమయంలో కూడా బ్రహ్మానందం.. సుధాకర్ తరఫున ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నారు. కే సుధాకర్ గురించి ముఖ్యంగా చెప్పుకోవాలంటే.. సినీనటుడు తారకరత్న బెంగళూరులోని ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న సమయంలో ఆయన చూపిన చొరవ గురించే. తారకరత్నను పరామర్శించేందుకు ఎన్టీఆర్, కల్యాణ్ రామ్‌లు బెంగళూరు వెళ్ళినప్పుడు అప్పటి రాష్ట్ర వైద్యారోగ్య శాఖ మంత్రిగా ఉన్న సుధాకర్ వారికి స్వాగతం పలకడంతో పాటు, ఆస్పత్రి వరకు వారి వెన్నంటే నడిచారు. తద్వారా ఆయన తెలుగు ప్రజలకు కాస్త దగ్గరయ్యారనే చెప్పాలి.
కర్నాటక ఎన్నికల ప్రచారంలో బ్రహ్మానందం -TV9 #karnatakaelections2023 #brahmanandam #TV9Telugu pic.twitter.com/pXrdA1AZzO
— TV9 Telugu (@TV9Telugu) May 4, 2023