భారతీయ సినిమా అంటే.. ఒకప్పుడు బాలీవుడ్ అని భావించేవారు. కానీ కరోనా తర్వాత పరిస్థితి పూర్తిగా మారిపోయింది. వచ్చిన సినిమాలు వచ్చినట్లే ప్లాఫ్ టాక్‌తో వెనుదిరుగుతున్నాయి. భారీ బడ్జెట్‌తో తెరకెక్కిన చిత్రాలు కూడా బాక్సాఫీస్ వద్ద ఢమాల్ అంటున్నాయి. ఈ క్రమంలో ప్రసుత్తం బాలీవుడ్ ఆశలన్ని.. అప్‌కమింగ్ ప్రాజెక్ట్ బ్రహ్మస్త్ర మీదనే ఉన్నాయి. రణ్‌బీర్ కపూర్, ఆలియా భట్, అమితాబ్ బచ్చన్, నాగార్జున ప్రధాన పాత్రల్లో నటించిన ఈ చిత్రంపై భారీ అంచనాలున్నాయి. ఈ క్రమంలో బ్రహ్మస్త్ర పార్ట్ 1 ట్రైలర్‌ని తాజాగా విrడుదల చేశారు. ఇది చూసిన నెటిజనులు బ్రహ్మస్త్రను ఓ రేంజ్‌లో ట్రోల్ చేస్తున్నారు.
‘బ్రహ్మాస్త్ర’ సినిమా ట్రైలర్ బుధవారం విడుదల చేశారు. హిందీ ప్రేక్షకులలో కొంత మందికి ట్రైలర్ నచ్చింది. మెజారిటీ ఆడియన్స్ నుంచి మంచి స్పందన లభిస్తోంది. హిందుత్వ వాదులకు మాత్రం ఒక్క విషయం నచ్చలేదు. అది ఏంటంటే… చెప్పులు వేసుకుని రణ్‌బీర్ కపూర్ గుడికి వెళ్లడం. ‘బ్రహ్మాస్త్ర’ ట్రైలర్‌లో రెండు మూడు సన్నివేశాల్లో రణ్‌బీర్ గుడిలో ఉంటారు. అక్కడ ఆయన చెప్పులతో కనిపించడం కొందరికి ఆగ్రహం తెప్పించింది. దాంతో ‘బాయ్ కాట్ బ్రహ్మాస్త్ర’ అంటూ ట్వీట్లు చేస్తున్నారు. గుడికి చెప్పులతో వెళతారా? అని ప్రశ్నిస్తున్నారు.
Who goes to the temple wearing shoes? Bollywood never fails to demean Hinduism. #Brahmastra #BrahmastraTrailer #RanbirKapoor #AliaBhatt pic.twitter.com/inCCaxy423
— 𝕍𝕚𝕤𝕙𝕦 🖤 (@vishumeme_) June 16, 2022
ఇది కూడా చదవండి: OTT Release: ప్రముఖ ఓటిటి సంస్థకు ‘777 చార్లీ’ డిజిటల్ హక్కులు.. రిలీజ్ ఎప్పుడంటే?
తెలుగు ప్రేక్షకులు అయితే ‘బ్రహ్మాస్త్ర’ను అక్కినేని నాగార్జున హీరోగా నటించిన ‘ఢమరుకం’ సినిమాకు హిందీ వెర్షన్ అంటున్నారు. ఇంకొందరు చిరంజీవి ‘అంజి’ సినిమా గుర్తొచ్చిందని ట్వీట్లు చేస్తున్నారు. కొంత మంది అయితే ట్రైలర్‌లో గ్రాఫిక్స్ సీరియల్ గ్రాఫిక్స్ తరహాలో ఉన్నాయని కామెంట్ చేస్తున్నారు. అటు హిందీలో… ఇటు తెలుగులో… ఎటు చూసినా ‘బ్రహ్మస్త్ర’ మీద ఓ రేంజ్‌లో సెటైర్లు పేలుతున్నాయి. మరి దీనిపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.
ఇది కూడా చదవండి: హీరోయిన్ సాయి పల్లవిపై పోలీసులకు ఫిర్యాదు! కారణం?
It’s fantasy…. sci-fi kaadu ga….it’s supposed to look mystical not natural…. entha pettina quality raadu
— Sharat Mudunuri (@Sharat1408) June 15, 2022