అతిలోక సుందరి శ్రీదేవి ముద్దుల కూతురు జాన్వీ కపూర్ ఇప్పుడు బాలీవుడ్ లో స్టార్ హీరోయిన్ గా కొనసాగుతోంది. ఆమె రెండో కూతురు ఖుషి కపూర్ కూడా త్వరలోనే బీటౌన్ ఎంట్రీ ఇస్తుందని వార్తలు వస్తున్నాయి. అందుకు తగ్గట్టుగానే ఇటీవల కాలంలో ఖుషి కపూర్ అందాల ప్రదర్శన బాగా పెరిగిపోయింది. సోషల్ మీడియాలో హాట్ హాట్ ఫోటోలు షేర్ చేస్తూ అందరి దృష్టిని తన వైపుకు తిప్పుకుంది. ఇటీవల కాలంలో లో మన అందరి ప్రదర్శన తన అక్క జాన్వీకపూర్ ను మించిపోయింది.
జాన్వి కపూర్ కూడా వరుసగా గ్లామర్ ఫోటోలను షేర్ చేస్తూ ఇంటర్నెట్ లో రచ్చ రచ్చ చేసింది. కరోనా సమయంలో యూత్ కు హాట్ ట్రీట్ తో దిల్ ఖుష్ చేసింది. జాన్వీ అంతగా రెచ్చి పోవడం తో శ్రీదేవి అభిమానులు షాక్ అయ్యారు. చాలామంది ఆమెపై ట్రోలింగ్ కూడా చేశారు. దీంతో ఇటీవల కాలంలో జాన్వి కాస్త సైలెంట్ అయింది. జాన్వీ కపూర్ అలా వెనక్కి తగ్గిందో లేదో ‘ఖుషి’ మొదలెట్టేసింది. ఖుషి కపూర్ – వాష్ రూమ్ లో దిగిన పిక్ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
సినిమాల్లోకి ఎంట్రీ ఇవ్వకుండానే ఇంత గ్లామర్ ఒలకబోస్తున్న ఖుషి వెండితెరపై ఇంకెంత సందడి చేస్తుందో చూడాలి. ఖుషీ తండ్రి, నిర్మాత బోనీ కపూర్ సైతం త్వరలోనే ఖుషీ నటిగా ఆరంగ్రేట్రం చేయనుందని స్పష్టం చేశాడు. అయితే ఖుషీని మొదట పరిచయం చేసేది మాత్రం తాను కాదని పేర్కొన్నాడు. లండన్‌లో ఫిలీం స్కూల్‌లో ఖుషీ యాక్టింగ్ ట్రైనింగ్ తీసుకుంటుందని, త్వరలోనే తను నటిగా మీ ముందుకు వస్తుందని పలు ఇంటర్య్వూలో జాన్వీ కూడా చెప్పుకొచ్చిన సంగతి తెలిసిందే.
త్వరలోనే మూవీ ఎంట్రీ ఇచ్చేవారి జాబితాలో షారుఖ్ ఖాన్ కూతురు సుహానా ఖాన్ కూడా ఉంది. ఈమె కూడా స్టార్ హీరోయిన్లకు ఏమాత్రం తీసిపోకుండా హాట్ ఫొటోలతో నెట్టింట్లో రచ్చ చేస్తుంటుంది.