‘బొమ్మరిల్లు భాస్కర్’ తాజాగా అఖిల్‌తో ‘మోస్ట్ ఎల్జిబుల్ బ్యాచిలర్’ చిత్రాన్ని రూపొందించాడు. ఈ చిత్రం అక్టోబరు 15న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ చిత్రంలో అక్కినేని అఖిల్ హీరోగా నటిస్తున్న విషయం తెలిసిందే. హీరోయిన్‌గా పూజాహెగ్దే నటిస్తోంది. ఈ చిత్రంలో ఈషారెబ్బ, ఆమని, వెన్నెల కిషోర్, మురళి శర్మ, పోసాని కృష్ణ మురళి ప్రధాన పాత్రల్లో నటిస్తున్నారు. అతిథి పాత్రల్లో సింగర్ చిన్మయి శ్రీపాద, రాహుల్ రవీంద్రన్ నటిస్తున్నారు. ఈ చిత్రం విడుదల తేదీ దగ్గరపడుతుండటంతో చిత్రబృందం ప్రమోషనల్ కార్యక్రమాలు చేపట్టారు. అందులో భాగంగా తాజాగా ఓ యూట్యూబ్ ఛానల్‌కు డైరెక్టర్ బొమ్మరిల్లు భాస్కర్, హీరో అఖిల్ ఇంటర్వూ ఇచ్చారు.
ఇంటర్వ్యూలో సినిమా షూటింగ్‌కు సంబంధించిన పలు ఆసక్తికర అంశాలను వెల్లడించారు. షూటింగ్‌లో నటీనటుల గురించి ప్రస్తావిస్తూ హీరో తల్లిగా నటించిన ప్రగతి నటన గురించి భాస్కర్ ప్రస్తావించాడు. ఆమె చాలా లీనమై చేసినట్లు. సెంటిమెంట్ సీన్లు తెరకెక్కిస్తున్నప్పుడు ప్రగతి ఎంతో భావోద్వేగానికి లోనైనట్లు తెలిపాడు. మరోవైపు పోసాని కృష్ణ మురళి గురించి ప్రస్తావిస్తూ బొమ్మరిల్లు సినిమా షూటింగ్ సమయంలో జరిగిన విషయాలను పంచుకున్నాడు. ‘బొమ్మరిల్లు సినిమాలో పోసానితో చేసిన సీన్లు ఆ సమయానికి ఎందుకో సెట్ కాలేదని డిలీట్ చేశాము. మళ్లీ ఇన్నాళ్లకు పోసాని కృష్ణమురళితో కలిసి సినిమా చేసేందుకు అవకాశం దక్కింది’ అని భాస్కర్ అప్పటి విషయాలను మరోసారి గుర్తు చేసుకున్నాడు.
ఇదీ చదవండి: నటరాజ్ మాస్టర్ ఎలిమినేషన్ అందరూ ఊహించిందేనా? అసలు కారణాలు ఇవే!