రష్మి-సుధీర్ జోడికి ఉన్న క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. రీల్ మీద వీరిద్దరి మధ్య ఉండే కెమిస్ట్రీ గురించి ఎంత చెప్పినా తక్కువే. ప్రేక్షకులను ఆకట్టుకోవడం కోసం.. వీరి మధ్య క్రియేట్ చేసిన లవ్ ట్రాక్ ప్రేక్షకులను ఎంతో ఆకట్టుకుంది. తొమ్మిదేళ్ల పాటు వీరు ప్రేక్షకులను ఆలరించారు. ఈ జంటను చూస్తే.. నిజంగా లవర్స్ అనే అనుకుంటారు. ఇక వీరిద్దరు పెళ్లి చేసుకోవాలని కోరుకునే వారు ఎంతో మంది ఉన్నారు. అయితే తెర మీద మాత్రమే తాము లవర్స్‌మని.. కానీ నిజ జీవితంలో తమ మధ్య ఎలాంటి రిలేషన్ లేదని ఇద్దరు పలు సందర్భాల్లో స్పష్టం చేశారు.
ఇక కారణాలు ఏవైతే ఏం కానీ.. ప్రస్తుతం సుధీర్ జబర్దస్త్, శ్రీదేవి డ్రామా కంపెనీ వంటి షోలలో కనిపించడం లేదు. ప్రస్తుతం సినిమాలతో బిజీగా ఉన్నాడు సుధీర్. అంతేకాక త్వరలోనే ఆహాలో స్ట్రీమ్ కాబోయే కామెడీ స్టాక్ ఎక్స్‌చేంజ్ కార్యక్రమం ద్వారా ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు. ప్రస్తుతం రష్మీ బుల్లితెర మీద షోలు చేస్తూ.. సినిమాలు కూడా చేస్తోంది. తాజాగా నందుతో కలిసి బొమ్మ బ్లాక్ బాస్టర్ సినిమాలో నటించింది. నవంబర్ 4న ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది. బుధవారం సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ నిర్వహించారు. దీనికి సుడిగాలి సుధీర్ కూడా వచ్చాడు.
ఈ సందర్భంగా సుధీర్.. రషీ మీద తనకున్న ప్రేమను, గౌరవాన్ని మరోసారి చాటుకున్నాడు. రష్మీ వైపు చూస్తూ.. మాట్లాడాడు. ముందుగా నందుతో తన ఫ్రెండ్‌షిప్ గురించి చెప్పి.. తర్వాత రష్మీ గారు అనగానే ఫ్యాన్స్ ఓ అంటూ అరిచారు. అప్పుడు రష్మీ.. గ్యాప్ రాలేదు ఇచ్చాను.. ఇప్పుడు మాట్లాడు అంటూ నందు, సుధీర్‌ను ఆటపట్టించాడు. ఇక రష్మీ చాలా కష్టపడి ఈ స్టేజ్‌కు వచ్చిందని.. తనతో పాటు.. తన చుట్టూ ఉండే వారు సంతోషంగా ఉండాలని కోరుకుంటుంది.. ఆపదలో ఉన్నారు.. ఆదుకోమని చెబితే.. వెంటనే స్పందించేవారిలో రష్మీ ఉంటుందని చెప్పుకొచ్చాడు. సుధీర్ మాటలకు రష్మీ ఎమోషనల అయ్యింది. చాలా రోజుల తర్వాత వీరిద్దరూ ఒకే వేదిక మీద కనిపించడంతో ఫ్యాన్స్ ఫుల్ ఖుషీ అవుతున్నారు. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన వీడియో వైరలవుతోంది.