బాలీవుడ్ స్టార్ హీరో షారూఖ్ ఖాన్ కొడుకు ఆర్యన్ ఖాన్ ముంబై తీరంలో క్రూయిజ్ షిప్‌లో డ్రగ్స్ తీసుకుంటూ.. అక్టోబర్ 2న ఎన్సీబీ అధికారులకు పట్టుబడిన విషయం తెలిసిందే. ఇటీవల ఆర్యన్ ఖాన్ కి కొన్ని షరతులతో కూడిన బెయిల్ మంజూరు అయిన విషయం తెలిసిందే. తాజాగా డ్రగ్స్ కేసులో షారూఖ్ ఖాన్ తనయుడు ఆర్యన్ ఖాన్ కు ఊరట లభించింది. ఇప్పటిదాకా ప్రతి శుక్రవారం నార్కోటిక్స్ కంట్రోల్ బ్యూరో (ఎన్సీబీ) ఆఫీసుకు వచ్చి వెళ్లాలని కోర్టు ఆదేశించిన సంగతి తెలిసిందే. అయితే, ఇకపై అలా ఎన్సీబీ ఆఫీసుకు రావాల్సిన అవసరం లేదని పేర్కొంటూ ఆర్యన్ కు బాంబే హైకోర్టు ఊరటనిచ్చింది.
ఇదే సమయంలో ప్రత్యేక దర్యాప్తు బృందానికి మాత్రం సహకరించాలని, విచారణకు అవసరమైనప్పుడు పిలిస్తే ఢిల్లీకి వెళ్లాలనే కొత్త షరతు విధించింది. ఇదిలా ఉంటే తాను ఓ స్టార్ తనయుడిని కనుక ప్రతి శుక్రవారం ఎన్సీబీ ఆఫీసుకు వెళ్తుంటే మీడియా తనను అనుసరిస్తోందని, పోలీసులనూ వెంటబెట్టుకుని వెళ్లాల్సి వస్తోందని ఆ సమయంలో పలు ఆటంకాలు ఏర్పడుతున్నాయని.. ఎన్సీబీ ఆఫీసుకు వెళ్లాలన్న షరతును కొట్టేయాలని కోరుతూ ఆర్యన్ ఖాన్ వేసిన పిటిషన్ వేసిన సంగతి తెలిసిందే.
ప్రస్తుతం ఢిల్లీలోని సిట్ కు బదిలీ అయినందున ముంబైలోని ఎన్సీబీ ఆఫీసుకు వెళ్లాల్సిన అవసరం లేదని వాదించాడు. ఇవాళ బాంబే హైకోర్టు విచారణ జరిగింది. ఈ నేపథ్యంలో హైకోర్టు ప్రతి శుక్రవారం ఎన్సీబీ ఆఫీసుకు రావాలన్న షరతును కొట్టేసింది.
Drugs-on-cruise case, Mumbai | Responding to Aryan Khan’s plea, Bombay High Court relieves him from appearing before Mumbai NCB but directs him “to appear before Delhi SIT whenever summoned.”
— ANI (@ANI) December 15, 2021