ముంబై క్రూయిజ్ డ్రగ్స్ కేసులో ఆర్యన్ ఖాన్ అరెస్ట్ కీలక పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. ఇక డ్రగ్స్ కేసులో ఆర్యన్ ఖాన్ కి బెయిల్ గురించి పడరాని కష్టాలు పడుతున్నారు కుటుంబ సభ్యులు. అక్టోబర్ 8 నుంచి ఆర్థర్ రోడ్ జైలులో ఉన్న ఆర్యన్ కేసు గురువారం బాంబే హైకోర్టులో విచారణకు వచ్చింది. బుధవారం కోర్టులో విచారణ సందర్భంగా, అదనపు సొలిసిటర్ జనరల్ (ఎఎస్‌జి) అనిల్ సింగ్ గురువారం గంటలో సమాధానం ఇస్తే, గురువారమే కేసును ముగించడానికి ప్రయత్నిస్తానని న్యాయమూర్తి చెప్పిన విషయం తెలిసిందే.
కాగా, ఆర్యన్ బెయిల్ దరఖాస్తు ఇప్పటికే 2 సార్లు తిరస్కరించబడింది. ఎట్టకేలకు షారూక్ ఖాన్ తనయుడు ఆర్యన్ ఖాన్ కి బెయిల్ మంజూరు అయ్యింది. డ్రగ్స్ కేసులో గత కొన్ిన రోజులగా రిమాండ్ లో ఉన్న ఆర్యన్ బెయిల్ పిటీషన్ పై గత కొన్ని రోజులుగా వాదనలు విన్న బాంబే హైకోర్టు.. ఆర్యన్ ఖాన్ తో పాటు మరో ఇద్దరికి బెయిల్ మంజూరు చేసింది.
ఆర్యన్ ఖాన్ బెయిల్ పిటీషన్ పై ప్రముఖ న్యాయవాది ముకుల్ రోహిత్గీ కోర్టులో వాదనలు వినిపించారు. ఎట్టకేలకు ఆర్యన్ కు బెయిల్ లభించడంతో షారుఖ్ కుటుంబసభ్యులు ఊపిరిపీల్చుకున్నారు. గత కొన్ని రోజులుగా తన కొడుకు బెయిల్ కోసం వేయి కళ్లతో ఎదురు చూస్తుంది ఆర్యన్ ఖాన్ తల్లి గౌరీ ఖాన్.
Bombay High Court grants bail to Aryan Khan in drugs-on-cruise case pic.twitter.com/MerVWcfpYZ
— ANI (@ANI) October 28, 2021