బాలీవుడ్ ప్రముఖ నటి మినో ముంతాజ్(79) తుదిశ్వాస విడిచారు. క్యాన్సర్‌తో బాధపడుతూ కెనడాలోని టోరంటోలో శనివారం ఆమె మరణించారు. భర్త సయ్యద్ అలీ అక్బర్‌తో కలిసి ఆమె కెనడాలోనే నివసించేవారు. ముంతాజ్ దంపతులకు ఒక కొడకు, ముగ్గురు కుమార్తెలు ఉన్నారు. బాలీవుడ్ స్టార్ కమెడియన్ మెహముద్ అలీ సోదరీ ఈ ముంతాజ్. అన్న అండగా ఆమె హిందీ సినిమా ఇండస్ట్రీలోకి అడుగు పెట్టింది.
ముంతాజ్ అసలు పేరు మల్లికున్నిసా అలీ. ‘సఖీ హతీమ్’ సినిమాతో బాలీవుడ్ ఎంట్రీ ఇచ్చారు ముంతాజ్. అనంతరం పలు చిత్రాల్లో నటించి మంచి గుర్తింపు పొందారు. సీఐడీ, హైరా బ్రిడ్జ్, కాగజ్‌కే ఫూల్, తాజ్‌మహాల్, ఘుంగట్, ఇన్‌సాన్ జాగ్ ఉఠా, ఘర్ బసాకే దేఖో, అలీబాబా, ధర్మపుత్ర వంటి చిత్రాల్లో ముంతాజ్ నటించారు.
#Mumbai: Veteran Bollywood actress Minoo Mumtaz (79) passed away in #Canada, a short while ago, informed her brother Anwar Ali. She was the sister of the late Bollywood comedian #Mehmood. pic.twitter.com/Rr8IubCJ3k
— IANS Tweets (@ians_india) October 23, 2021