బాలీవుడ్ బడా ప్రొడ్యూసర్ కరణ్ జోహార్ తన 50వ పుట్టినరోజు వేడుకలను ఎంతో ఘనంగా జరుపుకున్నారు. బాలీవుడ్ ఇండస్ట్రీలో స్టార్ ప్రొడ్యూసర్ గా కొనసాగుతున్న కరణ్ జోహార్.. పలు తెలుగు సినిమాలను హిందీలో విడుదల చేస్తూ మంచి విజయాలను అందుకున్నారు. ఈ క్రమంలోనే బాలీవుడ్ ఇండస్ట్రీతో పాటు సౌత్ ఇండస్ట్రీలో కూడా అందరితోనూ మంచి పరిచయాలను ఏర్పరుచుకున్నారు. ఈ క్రమంలో.. పుట్టిన రోజు వేడుకలకు సౌత్ నుంచి నార్త్ వరకు సెలబ్రిటీలందరిని ఆహ్వానించి పుట్టిన రోజు వేడుకలను ఘనంగా జరుపుకున్నారు. ఈ వేడుకల్లో.. మాజీ దంపతులు హృతిక్ రోషన్, సుశానే ఖాన్ వారి లవర్స్‌తో వేరు వేరుగా అటెండ్ అయ్యారు. ప్రస్తుతం ఈ వార్త సినీ ఇండస్ట్రీలో హాట్ టాపిక్ గా మారింది.
హృతిక్ ప్రేయసి సబా ఆజాద్‌ను వెంటేసుకుని రాగా, సుశానే తన ప్రియుడు అర్‌శ్లన్ గోనీతో విందుకు హాజరైంది. ప్రస్తుతం దీనికి సంబంధించిన ఫొటోలు, వీడియోలు నెట్టింట వైరల్‌గా మారాయి. అంతేకాదు మాజీ దంపతులు ఆమిర్ ఖాన్, కిరణ్ రావు కలిసి ఫొటోలకు పోజులిస్తూ పార్టీలో సందడి చేశారు. ఈ పార్టీకి పలువురు బాలీవుడ్ సెలెబ్రిటీలు సైతం హాజరయ్యారు. పూరీ జగన్నాథ్, చార్మీ కౌర్, విజయ్ దేవరకొండ, రకుల్ ప్రీత్ సింగ్ వంటివారికి ఆహ్వానాలు అందాయి. లైగర్ సినిమాను హిందీలో బడా నిర్మాతగా పేరు తెచ్చుకున్న కరణ్ జోహార్ నిర్మిస్తున్న సంగతి మనకు తెలిసిందే. వీరితో పాటు బాలీవుడ్ కి చెందిన పలువురు సినీ స్టార్ హీరో, హీరోయిన్లు సైతం హాజరయ్యారు.
ఇది కూడా చదవండి: జబర్దస్త్ గీతూ ఇంట్లో దొంగతనం! CCTV ఫుటేజ్ చూపిస్తూ గీతూ ఎమోషనల్!